Soundarya: సౌందర్య వల్లే `మిస్ యూ' అనే పదం ఎంత భారమైనదో తెలిసింది.. అర్జున్‌ సర్జా ఎమోషనల్‌

Published : Sep 05, 2026, 02:14 PM IST

సౌందర్య తెలుగు ఆడియెన్స్ గర్వించదగ్గ నటి. ఆమె అర్జున్ సర్జాకు కేవలం సహనటి మాత్రమే కాదు, ఓ మంచి స్నేహితురాలు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

PREV
17
బ్లాస్ట్ జోన్‌తో హీరోగా కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన అర్జున్‌ సర్జా

యాక్షన్‌ సినిమాలతో మెప్పించారు అర్జున్‌ సర్జా. దేశభక్తి చిత్రాలకు కేరాఫ్‌. తనదైన యాక్షన్‌తో మెప్పించే ఆయన సౌత్‌లో దాదాపు అన్ని భాషల్లో నటించారు. స్టార్‌ హీరోగా రాణించారు. ఇటీవల కాలంలో నెగటివ్‌ రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ మధ్య మళ్లీ హీరోగా మెప్పించారు. `బ్లాస్ట్ జోన్‌` చిత్రంలో నటించారు. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది.

27
సౌందర్య గురించి అర్జున్‌ కామెంట్‌

వెండితెరపై గర్జించే 'యాక్షన్ కింగ్' అర్జున్ సర్జా అంటే మనకు గుర్తొచ్చేది ఆయన క్రమశిక్షణ, దేశభక్తి, రఫ్ అండ్ టఫ్ ఫైట్లు. కానీ, అంతటి ధైర్యవంతుడి గుండెలోనూ ఓ సున్నితమైన బాధ ఉంది. ఆ బాధకు కారణం సౌందర్య. అవును, దివంగత నటి సౌందర్య అంటే భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తానికి ఓ ఇష్టం. కానీ అర్జున్ సర్జాకు మాత్రం ఆమె కేవలం సహనటి కాదు, ఓ మంచి స్నేహితురాలు.

37
సౌందర్య గురించి చెబుతూ అర్జున్‌ సర్జా ఎమోషనల్‌

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడుతూ అర్జున్ సర్జా భావోద్వేగానికి గురైన క్షణాలు అభిమానుల కళ్లను కూడా చెమ్మగిల్లేలా చేశాయి. ఆమెతో అనుబంధాన్ని పంచుకున్నారు. ఆమె మరణించిన తర్వాత తనలో కలిగిన భావాలను ఆయన పంచుకున్నారు.

47
మిస్‌ యూ పదానికి అర్థం ఏంటో తెలిసింది
మనం చాలా తేలికగా 'ఐ మిస్ యూ' అనే పదాన్ని వాడేస్తాం. కానీ అర్జున్ సర్జా ఈ పదం గురించి చెప్పిన మాటలు గుండెను తాకుతాయి. 'నా జీవితంలో 'మిస్ యూ' అనే పదానికి అసలు అర్థం, దాని వెనకున్న తీవ్రమైన బాధ ఏంటో తెలిసింది సౌందర్య మమ్మల్ని విడిచి వెళ్లినప్పుడే. ఆ లోటును ఎలా పూడ్చాలో తెలియలేదు. అప్పుడే ఆ పదం బరువు నాకు తెలిసింది' అని అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
57
అర్జున్‌కి మంచి స్నేహితురాలు సౌందర్య

అర్జున్ సర్జా సినీ ప్రయాణం పూలపాన్పు కాదు. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో ఆయనకు దొరికిన మంచి స్నేహితుల్లో సౌందర్య, జగపతి బాబు ముఖ్యులు. వీరితో కలిసి చాలా సినిమాలు చేశారు. హిట్‌ జోడీగా అనిపించుకున్నారు.

67
సౌందర్య లాంటి నటిని మళ్లీ చూడలేం
సౌందర్య గురించి అర్జున్ మాట్లాడుతూ.. 'ఒక వ్యక్తిలో ఉండాల్సిన ప్రతిభ, అందం, సంస్కారం, అన్నింటికన్నా ముఖ్యంగా సింప్లిసిటీ.. ఇవన్నీ సౌందర్యలో ఉన్నాయి. అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న నటిని మళ్లీ చూడటం అసాధ్యం' అని గుర్తుచేసుకున్నారు.
77
సౌందర్య ఎవర్ గ్రీన్‌
సౌందర్య నవ్వు, ఆమె నటన, సెట్‌లో ఆమె చూపించే ప్రేమ.. అన్నీ అర్జున్ సర్జా జ్ఞాపకాల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. యాక్షన్ కింగ్ మాటలు కేవలం ఒక నటుడివి కావు, ఓ మంచి స్నేహితుడు తన ప్రియమైన స్నేహితురాలికి అర్పించిన భావోద్వేగ నివాళి. సౌందర్య భౌతికంగా మనతో లేకపోయినా, అర్జున్ సర్జా లాంటి స్నేహితుల జ్ఞాపకాల్లో ఆమె ఎప్పటికీ జీవించే ఉంటారు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories