OTT Bigg Boss 6: అరియానా, యాంకర్‌ వర్షిణి, దుర్గారావు, అఖిల్‌, తనీష్‌.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా?

Published : Jan 30, 2022, 07:01 PM IST

బిగ్‌బాస్‌ రియాలిటీ షోకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. తెలుగులోనూ ఇది విశేష ఆదరణ పొందుతుంది. ఆరో సీజన్‌ మొదట ఓటీటీలో రాబోతున్న విసయం తెలిసిందే. అందులో పాల్గొనే వారి లిస్ట్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.

PREV
17
OTT Bigg Boss 6: అరియానా, యాంకర్‌ వర్షిణి, దుర్గారావు, అఖిల్‌, తనీష్‌.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా?

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ గత ఏడాది డిసెంబర్‌లో పూర్తయ్యింది. అంతా అనుకున్నట్టుగానే సన్నీ విన్నర్‌గా నిలిచారు. షణ్ముఖ్‌ రన్నరప్‌గా నిలిచారు. ఐదో సీజన్‌పై మొదట అనేక విమర్శలు వచ్చినప్పటికీ, ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. మరింతగా రక్తికట్టించింది. కంటెస్టెంట్లు ప్రాణం పెట్టి ఆడిన తీరు అందరి చేత ప్రశంసలందుకుంది. 

27

 అయితే మొదటి సీజన్‌ పూర్తయినప్పుడే మరో రెండు నెలల్లో ఆరో సీజన్‌ ప్రారంభమవుతుందని తెలిపారు నాగార్జున. ఐదో సీజన్‌ మొదట ఓటీటీలో ప్రసారమవుతుందన్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఇది ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తుంది. అయితే ఈ షోకి సంబంధించి పాల్గొనే కంటెస్టెంట్ల ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యిందనే టాక్‌ వినిపిస్తుంది. 

37

అయితే ఇందులో కొందరు పాత కంటెస్టెంట్లు కూడా పాల్గొనబోతున్నారట. అందులో ముఖ్యంగా బిగ్‌బాస్‌ 4 కంటెస్టెంట్లు అరియానా మరోసారి సందడి చేయబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. ఆయనతోపాటు అఖిల్‌ కూడా ఓటీటీ బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నారట. తనీష్‌, ఆదర్శ్‌, అలీ రెజా, హరితేజ వంటి పాత కంటెస్టెంట్ల ఓటీటీ బిగ్‌బాస్‌ 6లో పాల్గొనబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. 

47

వీరితోపాటు కొత్తగా యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, ఢీ10 విన్నర్‌ రాజు, టిక్‌టాక్‌ దుర్గారావు, `సాఫ్ట్ వేర్‌ డెవలపర్స్` వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాంకర్‌ ప్రత్యూష వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

57

మొదట ఓటీటీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ 6లో కొంత మందిని ఎంపిక చేసి, వారిని బిగ్‌బాస్‌ 6 మెయిన్‌ షోలో తీసుకుంటారని టాక్. ఓటీటీ షోకి కూడా నాగార్జున యాంకర్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ 6లో పాల్గొనే వారిని ఫైనలైజ్‌ చేసే ప్రక్రియ జరుగుతుందని సమాచారం. 

67

అఖిల్‌.. ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. `తెలుగబ్బాయి పంజాబీ అమ్మాయి` దాని పేరు. ఇందులో మోనాల్‌ లేడీ ఫీమేల్‌గా నటిస్తుంది. మరోవైపు `ఢీ 14`లో కింగ్స్ టీమ్‌ లీడర్‌గా కనిపిస్తున్నా

77

అరియానా.. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ బుజ్‌కి యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే. ఎలిమినేట్‌ అయిన వారిని ఇంటర్వ్యూలు చేస్తూ ఆసక్తికర విషయాలను రాబట్టారు. మరోవైపు అడపాదడపా టీవీ షోస్‌లో మెరుస్తుంది అర

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories