ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా ఆడియెన్స్ ను తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం తర్వాత తారక్ ఫ్యాన్స్ బేక్, మార్కెట్ కూడా అంతకంతకూ పెరిగాయి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన రాబోయే రెండు ప్రాజెక్ట్‌ల నుంచి వరుసగా అప్డేట్స్ ను అందించేందుకు రెడీ అవుతున్నారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 చిత్రాల నుంచి అభిమానులకు షాకింగ్ సర్ ప్రైజ్ అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.