ట్రెండీ అవుట్ ఫిట్ లో రకుల్ ప్రీత్ సింగ్ అదిపోయే స్టిల్స్.. చూపులతో అట్రాక్ట్ చేస్తున్న ఫిట్ నెస్ బ్యూటీ..

Published : May 10, 2022, 01:53 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్  ప్రీత్ సింగ్ లేటెస్ట్ అవుట్ ఫిట్లో సరికొత్త లుక్ ను సొంతం చేసుకుంది. తాజా ఫొటోషూట్ తో రకుల్ నెటిజన్లను అట్రాక్ట్  చేస్తోంది. తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  

PREV
16
ట్రెండీ అవుట్ ఫిట్ లో రకుల్ ప్రీత్ సింగ్ అదిపోయే స్టిల్స్.. చూపులతో అట్రాక్ట్ చేస్తున్న ఫిట్ నెస్ బ్యూటీ..

గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ఆడియెన్స్ కు ఎంతో దగ్గర. తన అందం, అభినయంతో సౌత్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. చిన్న,  పెద్ద తేడా లేకుండా అందరి హీరోల సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి అభిమానులను ఖుషీ చేసింది.

26

ప్రస్తుతం తెలుగులో రకుల్ కు ఆఫర్లు తగ్గాయనే చెప్పాలి. ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపూపిన ఈ బ్యూటీ తెలుగు చిత్రాలపై పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదు. మరోవైపు తెలుగు బడా హీరోలు కూడా కొత్త ముఖాలకు అవకాశాలు కల్పిస్తుండటంతో రకుల్ ప్రీత్ కు సినిమాలు తగ్గుతూ వచ్చాయి.  
 

36

ఏదేమైనా ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ నార్త్ ఆడియెన్స్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు వచ్చిన ఆఫర్లకు ఒకే చెబుతూ షూటింగ్ లతో బిజీ అవుతోంది. భిన్నమైన రోల్స్ లో నటిస్తూ బాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తోంది.

46

రకుల్ నటించిన ‘ఎటాక్’, ‘రన్ వే 34’ చిత్రాలు గత నెలలో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాల్లో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ కనిపించింది. అయితే ఈ రెండు యాక్షన్, థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. Runway 34 మాత్రం మిశ్రమ స్పందన పొందింది.
 

56

ఇలా హిందీతోపాటు తమిళ చిత్రాల్లో నటిస్తూ రకుల్ బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. మరోవైపు సినిమాలతోనే కాకుండా లేటెస్ట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలోనూ తన అభిమానులను పలకరిస్తోంది. తాజాగా రకుల్ ఫ్యాన్స్ కోసం కొన్ని పిక్స్ ను షేర్ చేసుకుంది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

66

ఈ ఫొటోల్లో రకుల్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటోంది. బ్లూ కలర్ కంఫర్ట్ వేర్ లో కాస్తా ట్రెడిషనల్ గా కనిపిస్తోంది. మ్యాచింగ్ ఈయర్ రింగ్స్ ధరించి క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఈ అవుట్ ఫిట్ లో అదిరిపోయే స్టిల్స్ ఇవ్వడంతో అభిమానులను ఖుషీ అవుతున్నారు.   

click me!

Recommended Stories