Brahmamudi: బరితెగించిన రాహుల్.. కావ్య మీద చెయ్యెత్తిన రుద్రాణి!

Published : May 25, 2023, 12:30 PM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తన అక్క జీవితం కాపాడటం కోసం తపన పడుతున్న ఒక చెల్లెలు కథ సీరియల్. ఇక ఈరోజు మే 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
110
Brahmamudi: బరితెగించిన రాహుల్.. కావ్య మీద చెయ్యెత్తిన రుద్రాణి!

 ఎపిసోడ్ ప్రారంభంలో వెళ్లి కింద పడుకో అంటాడు రాజ్. కిందన ఒళ్ళు నొప్పులు గా ఉంది అంటుంది కావ్య. అవును మరి మీ ఇంట్లో హంస తూలిక తల్పాలు ఉండేవి మరి అంటూ వెటకారమాడతాడు. ఈ పూటకి అడ్జస్ట్ అవ్వు రేపు పరుపు తెప్పిస్తాను అని చెప్పి కావ్య ని కిందకి పంపించేస్తాడు రాజ్. వెళ్లి కింద పడుకుంటుంది కావ్య. కాసేపటి తర్వాత కావ్యని నిద్ర లేపి నేను గురక పెట్టలేదు కదా అని అడుగుతాడు రాజ్.

210

 మీరు గురక మీద కాన్సన్ట్రేషన్తో పడుకోలేదు. ఇంకా నేనుకూడా సరిగా నిద్ర పోనేలేదు. మనం పడుకుని పది నిమిషాలు అయింది అంటుంది కావ్య. అవునా ఈసారి నిద్ర మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అంటూ పడుకుంటాడు రాజ్. మరోవైపు అరుంధతి, అపర్ణ కి ఫోన్ చేసి రాహుల్ వాళ్ళ ఎంగేజ్మెంట్ కి ముహూర్తం పెట్టారా అని అడుగుతుంది. ఇంకా లేదు పెట్టించాక ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది అపర్ణ.

310

 ముభావంగా ఉన్న అపర్ణతో ఏం జరిగింది అంటాడు సుభాష్. రాహుల్ మన ఇంటి అబ్బాయి కానీ అతని అలవాట్లు మంచివి కావు.. అలా అని నిజం చెబుదామంటే అపర్ణని ఫేస్ చేయలేము. ఇప్పటికే తన పెళ్లి నా వల్లే ఫెయిల్ అయింది  అనుకుంటుంది అంటూ బాధపడుతుంది అపర్ణ. దానికి నువ్వేం చేస్తావు పంతులు ముహూర్తం పెట్టినంతమాత్రాన మనం సంబంధాలు చూసినంత మాత్రాన పెళ్లిళ్లు అయిపోవు.

410

 బ్రహ్మముడి పడాలంటే దేవుడు రాసిపెట్టి ఉండాలి. మన రాజ్ పెళ్లి నే చూడు ఎంత నాటకీయంగా జరిగిందో అంటాడు సుభాష్. ఇప్పుడు అవన్నీ ఎందుకులెండి అంటూ నిష్టూరంగా  మాట్లాడుతుంది అపర్ణ. నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగిందని ఇలా మాట్లాడుతున్నావ్ కానీ నీ అహాన్ని పక్కన పెట్టి చూడు కావ్య ఎంత మంచిదో అంటాడు సుభాష్. మరోవైపు మళ్లీ కావ్యని నిద్రలేపి గురక రాలేదు కదా అని అడుగుతాడు రాజ్.

510

 గురక వినబడితే నేనే లేపుతాను అంటూ చిరాకు పడుతుంది కావ్య. గురక రాలేదు అని రేపు పొద్దున్న నువ్వే ఒప్పుకుంటావు పడుకో అంటూ చిరాగ్గా చెప్తాడు రాజ్. దేవుడా నాకేంటి శిక్ష అనుకుంటూ పడుకుంటుంది కావ్య. సీన్ కట్ చేస్తే రాహుల్ కి ఫోన్ మీద ఫోన్లు వస్తూ ఉంటాయి. అది ఎంగేజ్మెంట్ కాదు మీరు నమ్మకండి. ఏమైనా ఉంటే నేనే ఫోన్ చేసి చెప్తాను కదా అంటూ ఒక్కొక్కరికి ఎక్స్ప్లనేషన్ ఇస్తూ ఉంటాడు రాహుల్.

610

 ఇదంతా గమనిస్తున్న కళ్యాణ్, కావ్య దగ్గరికి వెళ్లి మనం అనుకున్నది ఒకటే జరుగుతున్నది మరొకటి అంటాడు. ఏం జరిగింది అంటుంది కావ్య. నాతో రండి చూపిస్తాను అంటూ రాహుల్ ఫోన్ మాట్లాడుతున్న ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ సీక్రెట్ గా రాహుల్ మాటలు వింటూ ఉంటారు. రాహుల్ అమ్మాయిలతో మాట్లాడటం విని మా అక్క ఒక్కతే బాధితురాలు అనుకున్నాను కానీ ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్య పోతుంది కావ్య.
 

710

ఈ పోస్ట్ ని మీ అక్క తప్ప అందరూ చూశారు అంటాడు కళ్యాణ్. ఇంతలో శృతి ఫోన్ చేసి మీ ఇంటి ముందున్నాను బయటికి రమ్మంటుంది. కంగారుగా బయటికి పరిగెడతాడు రాహుల్. వెనక ద్వారం ద్వారా కావ్య వాళ్ళు కూడా ఆమెని చూస్తారు. న్యూస్  రిపోర్టర్ అని గుర్తుపడతారు. రాహుల్ కంగారుగా శృతి దగ్గరికి వెళ్లి మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు పదా బయటికి వెళ్లి మాట్లాడుకుందాం అంటూ ఆమె బండిమీద బయటికి వెళ్ళిపోతారు.

810

పార్కులో శృతి తో మాట్లాడుతూ నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదు అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. వెన్నెల నీ కంటే అందమైనది డబ్బున్నది అంటూ తెగించి మాట్లాడుతాడు రాహుల్. పెళ్లి తర్వాత కూడా నిన్ను బాగా చూసుకుంటాను అంటూ అసహ్యంగా మాట్లాడుతాడు. ఈ మాటలు విన్న కళ్యాణ్ వాళ్ళు షాక్ అవుతారు ఇలాంటి వాడిన మా అక్క ప్రేమించింది అని అనుకుంటుంది కావ్య.
 

910

రాహుల్ మాటలకి కోపంతో అతని కాలర్ పట్టుకుంటుంది శృతి. నువ్వు ఏమి చేయలేవు ఒకవేళ నేరుగా మా ఇంటికి వచ్చి నిజం చెప్తాను అంటే నీ మిస్సింగ్ కేసె నీ ఛానల్లో న్యూస్ గా వస్తుంది అంటూ బెదిరించి వెళ్లిపోతాడు రాహుల్. శృతి దగ్గరికి వచ్చి నీకు మేమున్నాము అంటూ ధైర్యం చెప్తారు కావ్య వాళ్ళు. అతనిని పట్టించడం కోసం ఒక ఆధారమైన ఇవ్వు అతని సంగతి మేము చూస్తాము అంటారు.  అలాంటివేవీ లేవు.తెలివిగా ప్లాన్ చేశాడు ఒక ఫోటో కూడా నాతో తీయించుకోలేదు అంటుంది శృతి. ఏమి పర్వాలేదు గుర్తొచ్చాక ఫోన్ చెయ్యు. రేపు ఒకరోజు మాత్రమే టైం ఉంది అంటూ తన నెంబర్ ఇస్తాడు కళ్యాణ్. 

1010

మరోవైపు ఎంగేజ్మెంట్ కోసం పెళ్లికూతురుకి నగలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు రాజ్ కుటుంబ సభ్యులు. పెళ్లి పిలుపులు అయ్యాయా అంటుంది చిట్టి. అందరివి అయిపోయాయి ఈరోజు కావ్య వాళ్ళ అమ్మానాన్నలని పిలుస్తాను అంటుంది రుద్రాణి. నాకు ఇష్టం లేని పని చేయడంలో నీకు ఎంతో ఆనందం కదా రుద్రాణి అంటుంది అపర్ణ. తరువాయి భాగంలో నీ కొడుకు పెళ్ళిలో పోయిన పరువు నా కొడుకు పెళ్లి తో తిరిగి తీసుకు వస్తాను అంటూ అపర్ణతో చులకనగా మాట్లాడుతుంది రుద్రాణి. అందుకు కావ్య, రుద్రాణి మీద కోప్పడుతుంది. కోపంతో రుద్రాణి, కావ్య మీద చెయ్యెత్తుతుంది.

click me!

Recommended Stories