ఏపీ టికెట్ ధరల ఎఫెక్ట్: దిక్కుతోచని స్థితిలో టాలీవుడ్.. అఖండ నుంచి పెద్ద చిత్రాలే, నిర్మాతల ప్లాన్ ?

First Published Nov 24, 2021, 8:20 PM IST

టాలీవుడ్ చిత్రాలకు వసూళ్ళలో సింహభాగం ఏపీ నుంచే వస్తాయి. ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, సీడెడ్ ఏరియాల నుంచి టాలీవుడ్ చిత్రాలు అధిక వసూళ్లు రావడం చూస్తూనే ఉన్నాం. కానీ ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల టాలీవుడ్ కి భారీగా గండి పడింది. 

టాలీవుడ్ చిత్రాలకు వసూళ్ళలో సింహభాగం ఏపీ నుంచే వస్తాయి. ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, సీడెడ్ ఏరియాల నుంచి టాలీవుడ్ చిత్రాలు అధిక వసూళ్లు రావడం చూస్తూనే ఉన్నాం. కానీ ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల టాలీవుడ్ కి భారీగా గండి పడింది. టికెట్ ధరల్ని తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకువస్తోంది. దీనికి తోడు బెనిఫిట్ షోలని కూడా రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. ఇది టాలీవుడ్ నిర్మాతలకు ఊహించని షాక్. 

ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల Tollywood చిత్రాల వసూళ్ళపై తీవ్ర ప్రభావం పడనుంది. టికెట్ ధరలు ఎలా ఉన్నా సినిమా బడ్జెట్ మాత్రం మారదు. అలాంటప్పుడు టికెట్ ధరలు తగ్గించడం, బెనిఫిట్ షోలు రద్దు చేయడం వల్ల రికవరీ తీవ్ర కష్టంగా మారుతుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. స్టార్ హీరోల చిత్రాలు విడుదలైనప్పుడు నిర్మాతలు గతంలో బెనిఫిట్ షోలకు, తొలివారంలో అధిక షోలకు, టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి పొందుతూ వచ్చారు. దీనితో తొలి వారంలోనే సగం రికవరీ పూర్తయ్యేది. 

కానీ తాజా నిర్ణయాలతో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. అసలే Corona వల్ల ఎప్పుడో రిలీజ్ కావలసిన చిత్రాలు వాయిదా పడుతూ ఇప్పటికి విడుదలవుతున్నాయి. ఆలస్యం కారణంగా ఆల్రెడీ బడ్జెట్ పెరిగిపోయింది. దీనితో టికెట్ ధరల తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దు నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అయింది. 

డిసెంబర్ 2న విడుదలయ్యే బాలకృష్ణ Akhanda చిత్రం మొదలుకుని సంక్రాంతి వరకు వరుసగా భారీ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీనితో నిర్మాతలకు ఆలోచించుకునే సమయం కూడా లేకపోయింది. అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్,RRR, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ చిత్రాలు వరుసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాన్ని ఇకపై పోస్ట్ పోన్ చేయలేని పరిస్థితి. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకు బెనిఫిట్ షోలు లేకుండా వసూళ్ళలో అద్భుతాలు కష్టం. 

ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతలు పలుమార్లు మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. సమస్య పరిష్కారానికి హామీ లభించింది కానీ అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వం మాత్రం తాము అనుకున్నట్లుగా ఆన్లైన్ టికెట్ విధానాన్నే అమలు పరుస్తోంది. 

అయితే ప్రభుత్వం వాదన వేరేలా ఉంది. టికెట్ ధరలు తగ్గించడం వల్ల సినిమా అందరికి అందుబాటులో ఉంటుందని.. ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుకోవడం ఇకపై కుదరదని అంటున్నారు. దీనివల్ల టాలీవుడ్ కు ఏదో నష్టం జరిగిపోతుందనేది రాజకీయ ఆరోపణ మాత్రమే అని అంటున్నారు. ఆన్లైన్ టికెటింగ్ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుందని అంటున్నారు. మరి టాలీవుడ్ నిర్మాతలు ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు ఎలాంటి ప్లాన్ తో ముందుకు వెళతారో చూడాలి. Also Read: Divi Vadthya: చలి కాలంలో కూడా చెమటలు పట్టాల్సిందే.. దివి థండర్ థైస్ కి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి

Also Read: Poorna: రెడ్ హాట్ బ్యూటీ.. బరువైన పరువాలతో పూర్ణ ధగ ధగ మెరుపులు.. క్లీవేజ్ అందాలు అమేజింగ్

click me!