స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) మరోసారి స్పెషల్ సాంగ్ లో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే రంగస్థలం, ఎఫ్3లో గ్లామర్ స్టెప్పులేసిన ఈ భామా ముచ్చటగా మూడోసారి కూడా ఆడియెన్స్ ను అలరించనుంది.
కొంతకాలంగా హీరోయిన్లే ఐటెం సాంగ్స్ లో ఆడుతూ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ జాబితాలో పూజా హెగ్దే కూడా ఉంది. అయితే గ్లామర్ బ్యూటీకి ఈ ఏడాది సరిగా కలిసి రావడం లేదు. తను నటించిన రెండు చిత్రాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వకపోవడం ఎదురు దెబ్బ లాంటిదే. దీంతో స్పెషల్ సాంగ్స్ లో నటించేందుకు కూడా పూజా ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది.
26
గతంలోనే పూజా హెగ్దే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘రంగస్థలం’లో స్పెషల్ సాంగ్ లో నటించి కుర్రాళ్లను ఊర్రూతలూగించింది. ‘జిగేలు రాణి’ అంటూ అందాలు ఆరబోసిన పూజా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
36
ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ‘మహర్షి, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలతో మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఈ ఏడాది రిలీజ్ అయిన భారీ చిత్రాలు ‘రాధే శ్యామ్, బీస్ట్’ చిత్రాల్లో పూజా నటించినా తన క్రేజ్ ను పెంచలేకపోయాయి.
46
తాజాగా మే 27న రిలీజ్ అయిన ‘ఎఫ్3’లో పూజా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పూజాకు కలిసి వచ్చింది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. కాగా మరో బాలీవుడ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
56
‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. ఈ మూవీలో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్నారు. ఇదే చిత్రంలో పూజా హెగ్దే స్పెషల్ అపియరెన్స్ ఇవ్వనున్నట్టు టాక్ నడుస్తోంది.
66
ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ కూడా పూజాతో స్పెషల్ సాంగ్ ఒప్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే పూజా మళ్లీ ఐటెం సాంగ్ లో నటించేందుకు ఒకేచెబుతో లేదోననే సందేహం మాత్రం అందరిలోనూ ఉంది. ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నారు. ఇక ‘యానిమల్’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.