30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో

Published : Dec 08, 2025, 09:30 AM IST

అనుష్క శెట్టిని నాగార్జున సూపర్ మూవీతో పరిచయం చేశారు. అనుష్క ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న సమయంలో అగ్ర హీరో ఒకరు ఇన్వాల్వ్ అయ్యారట. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
సూపర్ మూవీతో అనుష్క శెట్టి ఎంట్రీ 

కింగ్ నాగార్జున అనుష్క శెట్టిని తన సూపర్ మూవీతో హీరోయిన్ గా పరిచయం చేశారు. ఆ మూవీలో అనుష్క గ్లామరస్ పాత్రలో అదరగొట్టింది. తొలి చిత్రంతోనే అనుష్కకి మంచి గుర్తింపు లభించింది. దీనితో స్టార్ హీరోల చిత్రాల్లో అనుష్కకి అవకాశాలు ప్రారంభం అయ్యాయి. కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించడం ప్రారంభించింది. 

25
అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు 

ఆమె నటించిన అరుంధతి చిత్రం తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో అనుష్కకి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ వచ్చింది. అరుంధతి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అనుష్కతో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. అరుంధతి తర్వాత అనుష్క కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పంచాక్షరి అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. 

35
మేకప్ మ్యాన్ తో అనుష్క సినిమా 

ఈ చిత్రానికి దర్శకుడు వి సముద్ర దర్శకుడు. ఈ చిత్రానికి నిర్మాత బొమ్మదేవర రామచంద్ర రావు. ఆయన ఎవరో కాదు.. కెరీర్ బిగినింగ్ నుంచి కింగ్ నాగార్జునకి మేకప్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లకు పైగా నాగార్జునకి రామచంద్ర రావు మేకప్ మ్యాన్ గా పనిచేశారు. పంచాక్షరి సినిమా ప్రారంభం అయ్యాక నాగార్జున డైరెక్టర్ వి సముద్రని పిలిచి స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. 

45
డైరెక్టర్ ని గోవా పిలిపించిన నాగార్జున 

ఆ సమయంలో నాగార్జున కేడి మూవీ షూటింగ్ లో గోవాలో ఉన్నారు. సముద్రని ఇక్కడకి తీసుకురా అని నాగార్జున రామచంద్రరావు కి చెప్పారట. దీనితో రామచంద్ర రావు.. వి సముద్రని గోవా తీసుకెళ్లారు. నాగార్జునని కలిశారు. నాగార్జున.. వి సముద్రతో మాట్లాడుతూ.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి అరుంధతి తీశారు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్. 

55
స్వీట్ వార్నింగ్ 

ఇక్కడ ఉన్నది రామచంద్రరావు.. నా మేకప్ మ్యాన్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంత పెద్ద నిర్మాత కాదు. సో రామచంద్రరావు లైఫ్ జాగ్రత్త. బడ్జెట్ ఎక్కువ ఖర్చు చేయకుండా సినిమాని జాగ్రత్తగా తీయాలి అని నాగార్జున స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి పంచాక్షరి చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 

Read more Photos on
click me!

Recommended Stories