కొన్ని పాత్రలు చేయాలంటే ధైర్యం ఉండాలి. ప్రేక్షకులు ఏమనుకున్నా పర్లేదనే తెగువ ఉండాలి. సమాజం తప్పుడు భావనతో చూసే వేశ్య పాత్ర చేయడం అంటే కత్తి మీద సామే. వేశ్య పాత్రలో భిన్న షేడ్స్ ఉంటాయి. మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించాల్సి రావచ్చు. తేడా కొడితే మొత్తంగా కెరీరే తిరగబడుతుంది. ఇవేమీ లెక్క చేయని కొందరు హీరోయిన్స్ ఛాలెంజ్ అంగీకరించారు. సాహసోపేతమైన వేశ్య పాత్రలో నటించారు.