గునరంజన్ శెట్టికి మాఫియా గ్యాంగ్ స్టర్స్ తో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్యాంగ్ స్టర్ ముత్తరప్పై బ్రతికి ఉండగా.. మాన్విత్ రై అనే వ్యక్తి, గుణరంజన్ ఇద్దరూ ఆయనకు అనుచరులుగా ఉండేవారు. వీరిద్దరూ ఆయనకు కుడి ఎడమ భుజాలు అని చెబుతుంటారు. ముత్తరప్పైమరణం తర్వాత మాన్విత్ రై , గుణ రంజన్ మధ్య విభేదాలు మొదలై విడిపోయారు.