బన్నీపై నాగబాబు ఘాటుగా కౌంటర్ , ఎలక్షన్స్ ముందు అని ఉంటే డ్యామేజీ గ్యారెంటీ?

Published : May 14, 2024, 09:12 AM IST

తాజాగా నాగబాబు వేసిన ట్వీట్ అల్లు అర్జున్ అభిమానుల ని మరింత రెచ్చగొడుతోంది. బన్నీ పేరెత్తకుండానే నాగబాబు ఘాటు 

PREV
110
  బన్నీపై నాగబాబు ఘాటుగా కౌంటర్ , ఎలక్షన్స్ ముందు అని  ఉంటే డ్యామేజీ గ్యారెంటీ?
Nagababu, allu arjun


అక్కడక్కడా చెదురు మదురు సంఘటనలు జరిగినా ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా రీపోలింగ్ కి అవకాశం లేదని, ఆ అవసరం రాలేదని చెప్పారు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా. ఓటరు జాబితా విషయంలో ఈ సారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు.  అయితే అదే సమయంలో ఈ  ఎన్నికలు మెగా ఫ్యామిలీలో మళ్లీ చిచ్చుపెట్టాయి. అల్లు అర్జున్ కు, మెగా ఫ్యామిలీకు మధ్య కోల్డ్ వార్ ట్వీట్ లతో బయిటకు వచ్చింది.

210
Chiranjeevi and Nagababu


గతంలో కూడా ఈ గొడవలు ఉన్నా ఈసారి అవి ఇంతలా బయిటకు రాలేదు. అల్లు కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి మధ్య పొలిటికల్ గోడలు ఓ ట్వీట్ తో  కట్టేసినట్లు అవుతోంది. తాజాగా నాగబాబు వేసిన ట్వీట్ అల్లు అర్జున్ అభిమానుల ని మరింత రెచ్చగొడుతోంది. బన్నీ పేరెత్తకుండానే నాగబాబు ఘాటు ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

310
Chiranjeevi and Nagababu


 "మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...!" అంటూ అల్లు అర్జున్ పేరెత్తకుండా అసలు విషయం చెప్పారు నాగబాబు. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లుళ్లు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. చిరంజీవి వీడియో సందేశం ఇవ్వగా, చివర్లో రామ్ చరణ్.. బాబాయ్ కోసం పిఠాపురం వచ్చారు. అయితే పవన్ కల్యాణ్ కి మద్దతుగా ట్వీట్ వేసి సరిపెట్టిన అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికోసం నంద్యాల రావడం సంచలనంగా మారింది.  
 

410


వాస్తవానికి ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పనిపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు శనివారం నంద్యాల వెళ్లారు. సతీసమేతంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థి చేయి పట్టుకుని మరీ మద్దతు ప్రకటించారు.

510


  వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం ఒకటైతే.. అల్లు అర్జున్ ఎంచుకున్న టైమింగ్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది.  ఒకవైపు బాబాయ్‌కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పిఠాపురం వెళ్తే.. అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాల వెళ్లడంపై నెటిజనం భిన్నంగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

610


అయితే  ఇదే అల్లు అర్జున్ రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. పవన్‌కల్యాణ్‌ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నానంటూ బన్నీ ఇటీవల ట్వీట్ చేశారు. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయంటూ బన్నీ ట్వీట్లో రాసుకొచ్చారు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ విజయాన్ని కోరుకుంటూ ట్వీట్ చేసిన బన్ని.. సరిగ్గా ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

710
Allu Arjun Pawan Kalyan Ram charan


ఇక పిఠాపురంలో  మిస్సైన మెగా హీరోలు ఎవ‌రు? అంటే మెగాస్టార్ చిరంజీవి...ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. తొలుత నిన్న‌టి రోజున చిరంజీవి కూడా వ‌స్తార‌ని ప్ర‌చారం సాగింది గానీ..చివ‌రి నిమిషంలో చిరు వెన‌క్కి త‌గ్గారు. స‌రిగ్గా   బ‌న్నీ నంద్యాల వైకాపా అభ్య‌ర్ధి త‌రుపున ప్ర‌చారం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. పార్టీల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని..స్నేహితులు ఏ పార్టీలో ఉన్న మ‌ద్ద‌తిస్తాన‌ని బ‌న్నీ స్పందించారు.  ఇది కాస్త మెగా అభిమానుల్లో కాస్త క‌ల‌వ‌రంగా మారినా  బ‌న్ని వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాన్నిగౌర‌వించాల్సిందే కాబ‌ట్టి త‌ప్ప‌లేదని కొందరు సమర్దించారు. 
 

810


అయితే అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీకి కోపం వచ్చినా బయటపడలేదు. ఇప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత నాగబాబు తెలివిగా ట్వీట్ వేశారంటున్నారు.  ముందుగానే ఈ కోపం ప్రదర్శిస్తే బన్నీ ఫ్యాన్స్ కూటమికి షాకిచ్చే ప్రమాదం ఉందని ఆగారంటున్నారు. అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత నర్మగర్భంగా ట్వీట్ వేసి బన్నీ ఫ్యాన్స్ కి మంట పెట్టారు నాగబాబు. 
 

910


ఈ క్రమంలో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ మొదలైంది.  నాగబాబు ట్వీట్ కి అల్లు అర్జున్ నేరుగా రియాక్ట్ అవుతారా, లేక ఫ్యాన్స్ సమాధానమే తన సమాధానం అంటూ సరిపెడతారా..? వేచి చూడాలి.

1010


గత ఎలక్షన్స్ సమయంలో ... నరసాపురం నుంచి జనసేన అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేస్తున్న నాగబాబుకు మెగా హీరో అల్లు అర్జున్ మద్దుతు తెలిపారు. మేం మీతో ఉన్నాం అని ట్వీట్ చేసిన బన్నీ.. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా, ప్రోత్సహిస్తున్నా.. మేమంతా మీతో ఉన్నాం అనే సందేశాన్ని పంపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయం తీసుకున్న నాగబాబు గారికి హృదయ పూర్వక అభినందలు. రాజకీయ ప్రయాణంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఎన్నికల ప్రచారంలో ఫిజికల్‌గా మేం మీతో ఉండకపోవచ్చు. కానీ మానసికంగా మాత్రం ఎప్పుడూ మీతోనే ఉన్నాం. మా మద్దతు మీకు ఎప్పటికీ ఉంటుంది’ అని అల్లు అర్జున్ లేఖ ద్వారా తెలిపారు.
 
 

Read more Photos on
click me!

Recommended Stories