Anushka Sharma : సూర్య రశ్మిని ఆస్వాదిస్తున్న ‘అనుష్క శర్మ’.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ..

First Published Jan 27, 2022, 4:45 PM IST

బాలీవుడ్ బ్యూటీ,  ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్  విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పలు తన ఫొటోలను షేర్ చేసి సూర్య రష్మి తీసుకోవాలంటోంది.
 

‘రబ్ నే బనా ది జోడి’ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన  అనుష్క శర్మ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తన కేరీర్ లో ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగింది. 
 

హిందీలో ‘బ్యాండ్ భజా భారత్’, ‘జబ్ తక్ హై జాన్’, ‘సుల్తాన్’, హే దిల్ హే ముషికిల్,  పీకే వంటి మూవీలతో తన క్రేజ్ ను పెంచుకుంది. 
 

తన రేంజ్ కు తగ్గట్టుగానే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకొని అందరినీ షాక్ గురిచేసింది. అప్పటి నుంచి తన వివాహా బంధాన్ని చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమైంది.
 

ఆ తర్వాత ఈ ‘విరుష్క’ జంట ఎక్కడ కనిపించినా ఇటు క్రికెట్ అభిమానులకు, అటు సినీ అభిమానులకు పండగే. వీరి గురించి ఏ చిన్న విషయం పొక్కినా నెట్టింట తెగ వైరల్ అయ్యింది.  

ఈ సెలబ్రెటీ జంటలకు కూతురు జన్మనిచ్చిన సందర్భంగా  కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉందిి అనుష్క. మళ్లీ తన సినీ కేరీర్ లో దూసుకుపోతోంది.  
 

కాగా, ఇటీవల తమ కూతురు ‘వామిక ’ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా కూడా స్పందించి అనుష్క. తాజాగా, సోషల్ మీడియాలో అనుష్క శర్మ సూర్య రష్మిని తీసుకుంటూ కనిపించింది. ఈ విధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తోంది అనుష్క శర్మ.   
 
 

click me!