అప్పటి నుంచి చైతు, సమంత మధ్య విభేదాలు మొదలయ్యాయా ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 27, 2022, 03:25 PM ISTUpdated : Jan 27, 2022, 09:48 PM IST

నాగ చైతన్య, నాగార్జున బంగార్రాజు చిత్రంతో బ్లాక్ బస్టర్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది.

PREV
16
అప్పటి నుంచి చైతు, సమంత మధ్య విభేదాలు మొదలయ్యాయా ?

నాగ చైతన్య, నాగార్జున బంగార్రాజు చిత్రంతో బ్లాక్ బస్టర్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. గత ఏడాది లవ్ స్టోరీ చిత్రంతో ఓ హిట్ ని దక్కించుకున్న చైతు ఈ ఏడాది బంగార్రాజుతో శుభారంభం చేశాడు. నాగార్జున, నాగ చైతన్య కలసి నటించిన చిత్రం ఇది. 

26

నాగ చైతన్య, సమంత గతేడాది విడిపోవడం చిత్ర పరిశ్రమలో ఊహించని పరిణామంగా మారింది. చాలా రోజుల పాటు ఈ విషయాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడిప్పుడే నాగ చైతన్య, సమంత ఇద్దరూ ఆ సంఘటన నుంచి బయట పడుతూ వర్క్ పై ఫోకస్ పెడుతున్నారు. చైతు, సమంత విడాకుల విషయంలో మౌనం వహించిన నాగార్జున.. ప్రస్తుతం ఒక్కో విషయాన్ని బయట పెడుతున్నారు. 

36

అసలు సమంత, నాగ చైతన్య విడిపోవడానికి గల కారణం ఎవరికీ తెలియదు. బయట ప్రచారం జరుగుతున్నవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఆ విషయంలో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో కొంత క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఖచ్చితంగా నాకు కూడా తెలియదు. 

46

గత ఏడాది న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ని ఇద్దరూ కలసి హ్యాపీగా చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సమస్య మొదలైంది. సమంతే మొదట విడాకుల నిర్ణయం తీసుకుంది అంటూ నాగార్జున ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆమె నిర్ణయాన్ని గౌరవించి చైతు కూడా విడాకులకు డిసైడ్ అయ్యాడు. 

56

ఆ సమయంలో నాగ చైతన్య ఫ్యామిలీ పరువు, మర్యాద గురించి ఎక్కువగా ఆలోచించాడు. నా గురించి ఎక్కువగా బాధపడ్డాడు అని నాగార్జున తెలిపారు. నాగ చైతన్య తన దగ్గరకు వచ్చి మీరు ఓకేనా నాన్న అని అడిగినట్లు నాగార్జున అన్నారట. అయితే సమంత మొదట విడాకులు కోరింది అనే వార్తలని నాగార్జున ఖండించారు.

66

సమంత, నాగ చైతన్య గత ఏడాది అక్టోబర్ లో తామిద్దరం విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చై సామ్ విడిపోవడంపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. సమంతపై అనేక ఆరోపణలు వినిపించాయి. కానీ సమంత వాటిని ధీటుగా ఎదుర్కొంది. 

Read more Photos on
click me!

Recommended Stories