దర్శకులకు అనుష్క కొత్త రూల్.. ఇకపై స్వీటీని అలా చూడటం కష్టమే..

Published : Apr 14, 2024, 06:16 PM IST

స్వీటీ అనుష్క మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతుంది. ఆమె సినిమాల జోరు పెంచుతుంది. కానీ ఓ కండీషన్‌తో వస్తుందట. ఇకపై ఆమెని అలా చూడటం కష్టమే అంటున్నారు.  

PREV
15
దర్శకులకు అనుష్క కొత్త రూల్.. ఇకపై స్వీటీని అలా చూడటం కష్టమే..

అనుష్క శెట్టి దాదాపు దశాబ్దన్నరగా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తూ వస్తోంది. `సూపర్‌`తో ప్రారంభమైన ఆమె సినిమా జర్నీ.. మొన్నటి `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` వరకు విజయవంతంగా సాగింది. ఆమె ఒక్కో సినిమాకి ఎదుగుతూ వస్తోంది. ఇప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌ రేంజ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్‌ హీరోలకు ధీటుగా తన సినిమాలతో కలెక్షన్లు కొల్లగొట్టిన ఘనత ఆమెకే దక్కుతుంది. 
 

25

`బాహుబలి`, `సైజ్‌ జీరో` తర్వాత అనుష్కలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా `సైజ్‌ జీరో` కోసం ఆమె బరువు పెరిగి తగ్గడంతో అది ఆమె ఆరోగ్యంపై ప్రభావం పడింది. బరువు తగ్గడం కష్టంగా మారింది. అందుకే సినిమాలు చేయడం కూడా తగ్గించింది. బయట కనిపించడమే మానేసింది. అయితే ఇటీవల మళ్లీ సెట్‌ అయినట్టుంది. ఆమె లేటెస్ట్ గా మలయాళ సినిమా ఓపెనింగ్‌లో పాల్గొంది. 
 

35

ప్రస్తుతం అనుష్క రెండు సినిమాలు చేస్తుంది. తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది. ఇందులో అనుష్క వేశ్య పాత్రలో కనిపిస్తుంది. ఆమెనే మెయిన్‌ లీడ్‌ కావడం విశేషం. ప్రస్తుతం ఇది రామోజీ ఫిల్మ్ సిటీలో, అలాగే బూత్‌ బంగ్లాలో చిత్రీకరణ జరుపుతున్నారట. దీనికి `గాటి` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 
 

45

మరోవైపు మలయాళంలోనూ ఓ సినిమాకి సైన్‌ చేసింది, అది ఇటీవలే ప్రారంభమైంది. ఇందులోనూ తన మెయిన్‌ లీడ్‌ అని తెలుస్తుంది. అయితే ఇది అనుష్క తీసుకున్న నిర్ణయమట. ఆమె ఇకపై లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనే నటించాలని డిసైడ్‌ అయ్యిందట. హీరో కి జోడీగా చేయడానికి నో చెబుతుందట. తనే లీడ్‌గా ఉండే సినిమాలకే ఓకే చెబుతుందట. ఈ రకంగా దర్శకులకు ఒక పర్‌ఫెక్ట్ సందేశాన్ని ఇస్తుందని అనుష్క. అలాంటి కథలతోనే తనని సంప్రదించాలని చెబుతుందట. 
 

55
Anasuya Bharadwaj

ఈ నేపథ్యంలో ఇకపై అనుష్కని రొమాంటిక్‌ లుక్‌లో చూడటం కష్టమే, గ్లామర్‌గానూ కనిపించడం కష్టమే అని చెప్పొచ్చు. అలాగే ఇతర హీరోల సరసన హీరోయిన్‌గా కనిపించడం కూడా కష్టమే. ఇక స్వీటీని అలా చూడటం సాధ్యం కాదనే అంటున్నారు. ఇది ఆమె అభిమానులను కొంత నిరాశ పరిచే విషయమనే చెప్పాలి. మరి అనుష్క ఈ నిర్ణయంలోనిజమెంతా? అనేది తెలియాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories