పెద్ద ఎన్టీఆర్‌ తర్వాత నీలో చూశాం.. 2034లో నువ్వే సీఎం‌.. జూ ఎన్టీఆర్ పై బాలీవుడ్‌ నటుడు సంచలన స్టేట్‌మెంట్‌..

Published : Apr 14, 2024, 05:43 PM ISTUpdated : Apr 14, 2024, 05:44 PM IST

ఎన్టీఆర్‌ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. భవిష్యత్‌ సీఎం ఎన్టీఆరే అని చెప్పడం విశేషం.   

PREV
17
పెద్ద ఎన్టీఆర్‌ తర్వాత నీలో చూశాం.. 2034లో నువ్వే సీఎం‌.. జూ ఎన్టీఆర్ పై బాలీవుడ్‌ నటుడు సంచలన స్టేట్‌మెంట్‌..
NTR

ఎన్టీఆర్‌.. భారీ సినిమాల్లో భాగమవుతున్నారు. పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ తన ఇమేజ్‌ని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో `దేవర` చిత్రంలో నటిస్తున్న ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `వార్ 2`లో నటిస్తున్నారు. గత రెండు రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్‌ లో పాల్గొన్నాడు తారక్‌. అందుకోసం ముంబయి వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే సందడి చేస్తున్నాడు. 
 

27

ఈ నేపథ్యంలో ముంబయిలో ఆయన ఓ పార్టీలో పాల్గొన్నాడు. ఎమ్మెల్యే జీషన్‌ బాబా సిద్ధిఖీతోపాటు బాలీవుడ్‌ నటుడు అక్బర్ బిన్‌ తబర్‌ పాల్గొన్నాడు. అక్బర్‌ బిన్‌ తబర్‌ ఎక్కువగా డెక్కన్‌ సినిమాల్లో నటిస్తున్నారు. అనేక సినిమాల చేసి మెప్పించారు. ఇప్పటికీ అలరిస్తున్నారు. ఈ పార్టీలో ఎన్టీఆర్‌, అక్బర్‌ బిన్ తబర్ కలిసి సందడి చేశారు. `వార్‌2` యూనిట్‌ కూడా పాల్గొన్నారు. ఇందులో ఎన్టీఆర్‌ గురించి ఆయన చెప్పిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

37

 ఇందులో సీనియర్‌ ఎన్టీఆర్‌ని గుర్తు చేశారు అక్బర్‌.. ఎన్టీఆర్‌.. అందరిని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, ఆయన వాయిస్‌ చాలాస్పెషల్‌ అని తెలిపారు. ఓ సందర్భంలో కార్యక్రమంలో ముస్లీంలు అంతా కూర్చొని ఉన్నారట. ఆ సమయంలో ఎన్టీఆర్‌.. మంజు జబ్బర్‌ గారు, అమిత్‌ గారు సలామ్‌ మాలేకుమ్‌.. రెండు రూపాయల బియ్యం తీసుకుపో.. అంటూ చెప్పేవారని తెలిపారు అక్బర్‌. మనది తెలుగుదేశం అని చెప్పేవారన్నారు. 

47

అలాంటి గొప్ప వాయిస్‌ ఆయనది అని, అలాంటి వాయిస్‌ మళ్లీ మీలో(ఎన్టీఆర్‌) చూసినట్టు తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది సూపర్‌ స్టార్లు ఉన్నారు. వాళ్లందరికి నువ్వు ఫాదర్‌వి అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు అప్పటిది ఒక ఎరా అని, ఇప్పుడు మళ్లీ ఆ ఎర రాబోతుందని తెలిపారు. 2034 ఎన్నికల్లో మీరే సీఎం అంటూ జోస్యం చెప్పాడు నటుడు అక్బర్‌. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 

57

ఎన్టీఆర్‌ని తాత సీనియర్‌ ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి దూరంగా ఉంటున్నారు. బాలకృష్ణతో, చంద్రబాబు ఫ్యామిలీతో కొంచెం గ్యాప్‌ రావడంతో తారక్‌ దూరంగా ఉంటున్నారట. అయితే ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రావాలని కార్యకర్తలు పిలుస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా టీడీపీ బాధ్యతలు ఆయనే చేపడతారని అంటున్నారు. ఈ విషయంలో మాత్రం ఎన్టీఆర్‌ మౌనంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు అక్బర్‌ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 
 

67
War 2 Movie

ఎన్టీఆర్‌.. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌2`లో నటిస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ మరో హీరో. ఇందులో తారక్‌ది నెగటివ్ రోల్‌ అని తెలుస్తుంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ రాబోతుంది. వచ్చే ఏడాది దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. 
 

77

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌రోల్‌ చేస్తున్నార. ఈ సినిమాని దాసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయబోతున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories