Prema Entha Madhram: సూపర్ ట్విస్ట్.. రాగసుధ తన సొంత చెల్లెలు అని తెలుసుకున్న అను!

Navya G   | Asianet News
Published : Jan 27, 2022, 11:29 AM IST

Prema Entha Madhram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం (Prema Entha madhram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమకథ నేపథ్యంలో  ఈ కథ కొనసాగుతోంది. ఇక ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో తెలుసుకుందాం.

PREV
17
Prema Entha Madhram: సూపర్ ట్విస్ట్.. రాగసుధ తన సొంత చెల్లెలు అని తెలుసుకున్న అను!

ఇక అను (Anu) కి పూజారి 20 ఏళ్లుగా రాజనందిని పేరిట అర్చన చేస్తుందన్న సంగతి చెబుతాడు. దాంతో అను ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాకుండా ఆ రాజనందిని (Rajanandini) లేదు చనిపోయిందని చెబుతాడు ఆ పూజారి.
 

27

అలా పూజారి చెప్పిన మాటలకు అను (Anu)  బాగా ఆలోచించి రాగసుధ నా చెల్లి ఆ.. అని గ్రహించుకుంటుంది. ఆ తరువాత అను.. రాజనందిని (Rajanandini) గా మళ్ళీ పుట్టానని అనుకుంటుంది. ఇంతకు మీరు ఎవరు అని పూజారి అనుని అడగగా నేను తనకి బాగా కావాల్సిన దాన్ని అని అను చెబుతుంది.
 

37

ఆ తర్వాత అను మనసులో రాగసుధ (Ragasudha ) రావాలి.  నా చెల్లెలు రావాలి అనుకుంటుంది. ఒకవేళ వస్తే నా కథలోని మలుపులు చెప్పడానికైనా రావాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒకవైపు చెల్లి అని తెలిసినందుకు ఆనందపడుతుంది అను (Anu). 
 

47

మరోవైపు రాగసుధ ఆఫీస్ లోపలికి వెళ్లడం తో అక్కడ జిండే (Zinde) ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాగసుధ వెనకనుంచి పొడవడానికి వెళుతుంది. ఈలోపు జిండే దగ్గరకు మీరా వస్తుంది. దాంతో రాగసుధ (Ragasudha) దాక్కొని ఉండిపోతుంది.
 

57

అలా ఆలోచించుకుంటూ పూజారి దగ్గరనుంచి అను (Anu)  తిరిగి వస్తుంది. ఇక అను దగ్గరకు ఆర్య (Arya) వచ్చి నీ మనసులోని  బాధ ఏమిటో చెప్పు అని అడుగుతాడు. దానికి అను త్వరలో చెబుతాను అని అంటుంది. ఇక పూజ తర్వాత అను తన చెల్లెలు గురించి వెతుకుతుంది.
 

67

అంతేకాకుండా తన చెల్లి కోసం అక్కడే ఒకరోజు ఉండాలని ఆర్యతో (Arya) చెప్పి ఉండటానికి సిద్ధమవుతుంది. మరోవైపు ఆఫీసులో ఉన్న మీరా.. రాగసుధ (Ragasudha) ను గమనిస్తుంది. దాంతో రాగసుధ బయటికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది.
 

77

ఇక సెక్యూరిటీ తో సహా ఆఫీస్ ప్యూన్ కూడా రాగసుధ ను వెతుకుతారు. కానీ రాగసుధ (Ragasudha) వారికి కనిపించకుండా వేరే చోట దాక్కొని ఉంటుంది. మొత్తానికి అను మరుసటి రోజు తన చెల్లిని ఎలాగైనా కలవాలని కోరుకుంటుంది. తనకోసం ఆర్య కూడా ఉండటంతో అను (Anu) సంతోషంగా ఫీల్ అవుతుంది.

click me!

Recommended Stories