ఆ నటుడితో బ్రేకప్ తర్వాత రవికృష్ణతో లాకప్... నవ్య స్వామి ఎఫైర్ పై వైరల్ అవుతున్న పోస్ట్

First Published | Jun 25, 2021, 2:28 PM IST

సీరియల్ నటులు రవి కృష్ణ, నవ్య స్వామి ప్రేమ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్. ఆమె కథ అనే తెలుగు సీరియల్ లో కలిసినటిస్తున్న ఈ జంట నిజ జీవితంలో కూడా ప్రేమికులే అంటూ వార్తలు వస్తూ ఉంటాయి. బుల్లితెరపై వీరి కెమిస్ట్రీ పండడానికి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కారణం అని కొందరు వాదిస్తున్నారు. 
 

జనాలు అలా అనుమాన పడడానికి వీరిద్దరి ప్రవర్తన కూడా కారణం. దాదాపు షోలో కనిపించినా వీరిద్దరూ జంటగానే ఉంటారు. కలిసి కపుల్ లా పాల్గొంటారు. ఒకరంటే మరొకరు విడిచి ఉండలేనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు.
ఇక ఆ మధ్య ఈ జంటకు ఓ కార్యక్రమంలో బొమ్మల పెళ్లి కూడా చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నవ్య స్వామి, రవి కృష్ణలకు పెళ్లి చేయడం జరిగింది. ఇక మీరిద్దరూ లవర్స్ అట కదా.. అని చాలాసార్లు అడగడం జరిగింది. అయితే మేము స్నేహితులం మాత్రమే అని చెబుతూ ఉంటారు.

తాజాగా ఓ నెటిజన్ కామెంట్ వీరి ఎఫైర్ పై వార్తలు వెలువడేలా చేసింది. నవ్య స్వామి తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. మానసిక శాంతి తన్ను ఆకట్టుకుంటే లక్షణం.. దానితో నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించండి.. అంటూ కామెంట్ పెట్టారు.
నవ్య స్వామి కామెంట్ క్రింద... రవి కృష్ణ లవ్ సింబల్స్ కూడిన రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ప్రేమికులు కాదంటూనే రవి కృష్ణ ఆమెకు ఆ పద్దతిలో రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
అయితే అదే పోస్ట్ క్రింద ఓ నెటిజెన్... నవ్యస్వామి మొదట అవీష్ గౌడ అనే వ్యక్తితో ఎఫైర్ నడిపింది. అతనితో బ్రేకప్ తరువాత రవికృష్ణతో ఎఫైర్ మొదలుపెట్టింది.. అంటూ కామెంట్ చేశాడు.  దీనితో నవ్య స్వామి లవ్ ఎఫైర్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

ravi krishna

నవ్య స్వామి గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు, తరువాత కొన్ని కారణాల చేత బ్రేకప్ అయినట్లు స్వయంగా ఒప్పుకుంది.
తాజా నెటిజెన్ కామెంట్ ద్వారా అది మరోమారు రుజువైంది. అలాగే మరి నెటిజెన్ కామెంట్ చేసినట్లు రవికృష్ణ, నవ్య స్వామి బంధం ఎంత వరకు, వారు నిజంగానే ప్రేమలో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.

Latest Videos

click me!