మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. కార్తికేయ 2 చిత్రంలో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ సరసన బోల్డ్ రొమాన్స్ పండించేందుకు టిల్లు స్క్వేర్ అనే చిత్రంలో నటిస్తోంది.