భారీగా డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి, నాగచైతన్య తో సినిమాకు రెమ్యునరేషన్ ఎంతంటే..?

First Published | Sep 22, 2023, 10:04 AM IST

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు నాగచైతన్యా.. తన జోడీగా సాయి పల్లవి కన్ ఫార్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈసినిమాకు సాయి పల్లవి తీసుకునే రెమ్యూనరేషన్.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

రీసెంట్ గా  కస్టడీ సినిమాతో దెబ్బతిన్నాడు అక్కినేని హీరో నాగచైతన్న. ఇక ప్రస్తుతం చైతూ..  గీత ఆర్ట్స్ బ్యానర్ లో.. మూవీ చేయబోతున్నాడు.  డైరెక్టర్ చందు మొండేటి ఈసినిమాను డ్రైవ్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి ఫిక్స్ అయ్యింది. ఈ విషయం రీసెంట్ గానే అనౌన్స్ చేశారు టీమ్. అయితే ఈసినిమా కోసం సాయి పల్లవి తీసుకునే రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఈసినిమా కోసం ఎంత డిమాండ్ చేస్తుదంటే..? 

ప్రస్తుతం ఈ సినిమా  ఫ్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ పాత్రకోసం నాగచైతన్య చాలా హోమ్ వర్క్ చేశాడు.. డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగి... ప్రాక్టికల్ గా ..జాలర్లకు సబంధించిన విషయాలు తెలుసుకున్నారు. అంతే కాదు.. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు చైతూ.. తనను తాను నిరూపించకోవాలి అని పట్టుదలతో ఉన్నాడు. 


Sai pallavi, naga chaitanaya

అయితే నాగచైతన్య ఈ సినిమాలో చాలా నేచురల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. దాని తగ్గట్టుగానే.. సాయి పల్లవిని తీసుకున్నారు.. సాయి పల్లవి నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. సహజంగా ఉంటుంది. మంచి కథలు తీసుకుంటుంది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే పాత్రను తీసుకుంటుంది. అందుకే ఈ సినిమాను వెంటనే ఒప్పేసుకుందట సాయి పల్లవి. ఇక ఈసినిమా కోసం గట్టిగానే డిమాండ్ చేస్తుందట బ్యూటీ.  

నాగచైతన్య సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నాగచైతన్య - సాయి పల్లవి కాంబినేషన్లో రెండో సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే వీరిద్దరూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన లవ్ స్టోరీ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తున్నారని తెలియడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో నటించడం కోసం సాయి పల్లవి భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి ఇప్పటివరకు తన కెరీర్లు తీసుకొనటువంటి రెమ్యూనరేషన్ ఈ సినిమాకు తీసుకోబోతుందని సమాచారం.

actress Sai Pallavi

నాగచైతన్య సినిమా కోసం సాయి పల్లవి ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి కెరియర్ లో ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ కావడం విశేషం. ఇక ఈ సినిమాకు నాగచైతన్య కేవలం ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా వీరిద్దరికీ కేవలం రెండు కోట్ల తేడా అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి వీరి రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
 

Latest Videos

click me!