అయినా తను ఎందుకు అలా వెళ్ళిపోయింది పిల్లల్ని కళ్ళారా చూడనీయకుండా అలా ఎలా తీసుకెళ్లి పోయింది. నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక, తను ఎందుకు అలా వెళ్ళిపోయిందో అర్థం కాక నరకం అనుభవిస్తున్నాను అంటూ పిచ్చిగా తన చేతికి తనే గాయం చేసుకుంటాడు ఆర్య. కంగారు పడిన శారదమ్మ అంజలికి బ్యాండైడ్ తీసుకురమ్మంటుంది. కనిపించిన గాయానికి కట్టు కడతావు కానీ ఇది చాలా చిన్నది.