'మా' సభ్యత్వం రద్దుపై కరాటే కళ్యాణి ఆవేదన.. ఎవరో కుట్ర చేసే ఈ పని చేశారు, రాసుకుని పూసుకుని తిరిగాను

Published : May 26, 2023, 06:50 AM IST

లేడి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో కరాటే కళ్యాణి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో జరిగే కార్యక్రమాల్లో కరాటే కళ్యాణి చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. అలాగే టివి సీరియల్స్ లో కూడా కరాటే కళ్యాణి నటించింది.

PREV
16
'మా' సభ్యత్వం రద్దుపై కరాటే కళ్యాణి ఆవేదన.. ఎవరో కుట్ర చేసే ఈ పని చేశారు, రాసుకుని పూసుకుని తిరిగాను

లేడి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో కరాటే కళ్యాణి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో జరిగే కార్యక్రమాల్లో కరాటే కళ్యాణి చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. అలాగే టివి సీరియల్స్ లో కూడా కరాటే కళ్యాణి నటించింది. ఇదిలా ఉండగా కరాటే కళ్యాణి తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. 

26

ఖమ్మంలో ఎన్టీఆర్ శత జయంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి గెటప్ లో ఏర్పాటు చేయడం వివాదంగా మారింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు రూపొందించడంతో యాదవ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక వ్యక్తిని దైవంగా భావించవచ్చు. 

36

కానీ హిందువులు పవిత్రంగా కొలిచే శ్రీకృష్ణుడి రూపాన్ని మరో వ్యక్తిని ఆపాదించడం ఏంటి..సినిమాల్లో పాత్రలు చేస్తే దేవుళ్ళు అయిపోతారా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణని అడ్డుకోవాలని కోర్టుకు కూడా వెళ్లారు. విగ్రహావిష్కరణపై కోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ వివాదంలో నటి కరాటే కళ్యాణి బలిపశువుగా మారారు. 

46

కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణని కరాటే కళ్యాణి కూడా వ్యతిరేకిస్తున్నారు.  ఎన్టీఆర్ ఎవరికి దేవుడు, ఏ వర్గానికి ఆయన దేవుడు.. దేని కోసం ఆయన్ని దేవుణ్ణి చేస్తున్నారు. ఒక వ్యక్తిని సాక్షాత్తు శ్రీకృషుడితో పోల్చడం, ఆయన రూపాన్ని ఆపాదించడం ఏంటి అంటూ కరాటే కళ్యాణి ప్రశ్నించారు. ప్రతి హీరోకి ఇలాగే దేవుడి రూపంలో ఉన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తారా అని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. కరాటే కళ్యాణి చేసిన ఈ వ్యాఖ్యలే ఆమెని చిక్కుల్లో పడేశాయి. 

56

ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వాలని మా అసోసియేషన్ ఇటీవల ఆమెకి షోకాజ్ నోటీసులు పంపింది. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వలేదని ఆమె సభ్యత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కరాటే కళ్యాణి ఆవేదన వ్యక్తం చేస్తూ స్పందించారు. నేను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదు. నేను ఎన్టీఆర్ విగ్రహానికి వ్యతిరేకం కాదు. కృష్ణుడి రూపంలో పెట్టడానికి వ్యతిరేకం. 

66

ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహాలు పెడితే ఇక దేవుళ్ళు ఎందుకు అని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. ఇలా మాట్లాడినందుకు నాకు మా అసోసియేషన్ నుంచి నోటీసు పంపారు. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల స్పందించలేదు. ఇంతలోనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నేను 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఏం జరిగినా ముందుండి పాల్గొన్నాను. నా ఇండస్ట్రీ అని రాసుకుని పూసుకుని తిరిగాను. అలా చేసినందుకు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు అని కరాటే కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఎవరో ఎక్కడో కుట్ర చేశారు. నా సభ్యత్వం రద్దు చేసినా నేను ఇండస్ట్రీని వదిలి వెళ్ళను.. ఇక్కడే ఉంటా అని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు. 

click me!

Recommended Stories