కాస్తైనా అన్నం తిను అని బ్రతిమాలుతుంది. ఇంకెక్కడే ధైర్యం అమ్మ భార్య పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు. ఎప్పుడు వస్తారో తెలియదు అసలు వస్తారో తెలియదు అని బాధపడతాడు ఆర్య. ఇంతలో చిన్న పిల్లల ఏడుపు వినిపిస్తుంది. చిన్నపిల్లడిలా రోడ్డుమీదికి పరిగెడతాడు ఆర్య. ఏం జరిగిందో అనుకొని ఆర్య వెనకాతల పరిగెడతారు నీరజ్, జెండేవాళ్ళు.