అను ఇమ్మాన్యుయేల్ మత్తెక్కించే కళ్లు వైపు చూశారా.. పండగపూట మతిచెడగొడుతున్న యంగ్ బ్యూటీ.!

First Published | Nov 12, 2023, 4:32 PM IST

యంగ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియాలో పండగవేళ గ్లామర్ మెరుపులు మెరిపించింది. చీరకట్టులో కాంతులు విరజిమ్మే అందంతో మరింతగా ఆకట్టుకుంది. తాజా పిక్స్ వైరల్ గా మారాయి. 
 

యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది నేచురల్ స్టార్ నానినే. ‘మజ్ను’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే ఆకట్టుకుంది. 
 

బన్నీ, పవన్ కళ్యాణ్ తదితర హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు పెద్దగా హిట్లు మాత్రం పడలేదనే చెప్పాలి. వరుసగా ఫ్లాప్స్ నే అందుకుంటూ వస్తోంది. అటు తమిళంలోనూ అదే పరిస్థితి.


తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ సరసన ‘జపాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. చిత్రానికి పాజిటివ్ టాక్ అందించినా ఈ బ్యూటీ పేరు పెద్దగా వినిపించడం లేదు. 
 

సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. కానీ ఉన్నంత సేపు తన గ్లామర్, నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నా పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

సినిమాల విషయాన్ని పక్కకు పెడితే సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తోంది. దీపావళి సందర్భంగా చీరకట్టులో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా మరిన్ని పిక్స్ ను పంచుకుంది.
 

ట్రాన్స్ ఫరెంట్ గ్రీన్  శారీలో మంత్రముగ్ధులను చేసింది. చీరకట్టులో హోయలు పోతూ మతులు పోగొట్టింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ తో మైమరిపించింది. మత్తు కళ్లతో నిషా ఎక్కించింది. కొంటె చూపులతో కవ్వించింది. తన అభిమానులతో పాటు నెటిజన్లను ఫిదా చేసింది.

Latest Videos

click me!