అల్లు శిరీష్ తో ఘాటుగా రొమాన్స్.. రియల్ లైఫ్ లో అలాంటి ముద్దు ముచ్చట్లపై అను ఇమ్మాన్యుయేల్ కామెంట్స్

Published : Nov 02, 2022, 09:44 PM IST

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం నవంబర్ 4న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

PREV
16
అల్లు శిరీష్ తో ఘాటుగా రొమాన్స్.. రియల్ లైఫ్ లో అలాంటి ముద్దు ముచ్చట్లపై అను ఇమ్మాన్యుయేల్ కామెంట్స్

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం నవంబర్ 4న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రొమాంటిక్ కామెడీ సన్నివేశాలతో ట్రైలర్ తెగ వైరల్ అయింది. సినిమాపై కూడా మంచి బజ్ ఏర్పడింది. 

26

శిరీష్, అను ఇద్దరూ ఈ చిత్రంలో రొమాన్స్ లో రెచ్చిపోయారట. ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి రొమాన్స్ మొదలైనట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్స్ ని శిరీష్ ఖండించాడు. తాజాగా అను ఇమ్మాన్యుయేల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

 

36

మొదట బన్నీ వాస్ ఈ కథతో నా వద్దకు వచ్చారు. రెగ్యులర్ సినిమా తరహాలో నాలుగైదు సీన్లకు హీరోయిన్ పరిమితం అయ్యే పాత్ర కాదు. అందుకే ఈ చిత్రానికి అంగీకరించా. ఈ చిత్ర ప్రారంభం రోజునే శిరీష్ ని మొదటి సారి కలిశా. కాఫీ షాప్ లో కూర్చుని ఇద్దరం పాత్రల గురించి చర్చించుకున్నాం. 

46

రియల్ లైఫ్ లో నేను చాలా స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉంటాను. ఏ పని చేసిన జీవితంలో ముందుకి వెళ్లాలనే ఆలోచన ఉంటుంది. ఈ చిత్రం నేను పోషించిన సింధు పాత్ర కూడా అంతే. కాకపోతే ఈ చిత్రంలో ఉన్న రొమాన్స్ లాగా నాకు రియల్ లైఫ్ లో అలాంటివి లేవు. ఆ తరహా క్యారెక్టర్ నాకు రియల్ లైఫ్ లో సెట్ కాదు అని అను తేల్చేసింది. ఈ చిత్రంలో అల్లు శిరీష్ తో లిప్ లాక్స్, ఫిజికల్ రొమాన్స్ పై అను పరోక్షంగా ఇలా కామెంట్స్ చేసింది. 

56

తాను పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య లాంటి స్టార్స్ తో నటించానని అను పేర్కొంది. ఆ చిత్రాలు నిరాశపరిచినప్పటికీ నా నటనకి ప్రశంసలు దక్కాయి. నేను నటిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు అని అను చెప్పుకొచ్చింది. 

 

66

ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ రవితేజ 'రావణాసుర' చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో తన పాత్ర చాలా క్రేజీగా ఉంటుందని అను పేర్కొంది. వరుసాగా పరాజయాలు ఎదుర్కొంటున్న అనుకి ఊర్వశివో రాక్షసివో చిత్రం విజయం సాధించడం చాలా కీలకం. 

click me!

Recommended Stories