Nagarjuna-ANR: వల్గారిటీ ఎక్కవైందని నాగార్జునకి ఏఎన్నార్‌ వార్నింగ్‌.. తండ్రికే అదిరిపోయే కౌంటర్‌

Published : Nov 03, 2026, 08:20 AM IST

తన సినిమాల్లో వల్గారిటీ ఎక్కువ అవుతుందని చెప్పి నాగార్జునకి ఒకసారి ఏఎన్నార్ క్లాస్‌ తీసుకున్నారట. దీనికి మన్మథుడు రియాక్ట్ అయ్యాడు. సొంత తండ్రికే అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడట. అదేంటంటే?

PREV
13
నాగార్జునకి మించిన మన్మథుడు ఏఎన్నార్‌

టాలీవుడ్‌లో మన్మథుడిగా రాణించారు నాగార్జున. అయితే ఆయనకు మించిన మన్మథుడు తాతగారు ఏఎన్నార్‌ అంటాడు సుమంత్‌. ఆయన్ని దగ్గరుండి చూసిన నేపథ్యంలో ఏఎన్నార్ ఏంటో తనకు తెలుసు అని సుమంత్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కినేని ఎక్కువగా జానపదాలు, సాంఘీక చిత్రాలు చేశారు. అందులోనూ లవ్‌ స్టోరీస్‌ బాగా చేశారు. `దేవదాస్‌`,`ప్రేమ్‌ నగర్`, `ప్రేమాభిషేకం` వంటి చిత్రాలు ఆ కోవకు చెందినవే. నిజానికి అసలు మన్మథుడు ఏఎన్నార్‌ అనే చెప్పాలి. ఆ తర్వాత దాన్ని నాగార్జున కంటిన్యూ చేశారు. రియల్ మన్మథుడిగా పేరుతెచ్చుకున్నారు.

23
వల్గారిటీ విషయంలో నాగార్జునకి ఏఎన్నార్‌ వార్నింగ్‌

అయితే నాగార్జున రొమాన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఏఎన్నార్‌ ఒకసారి వార్నింగ్‌ ఇచ్చారట. ఓ సినిమా విషయంలో చర్చకు వచ్చిందట. ఆ మూవీ చూసి `నాన్నా.. కొన్ని సీన్లలో వల్గారిటీ ఎక్కువగా కనిపిస్తుందని, ఓవర్‌ డోస్‌ అవుతున్నట్టుంది ఒకసారి చూసుకో` అని చెప్పి నాగార్జునకి వార్నింగ్‌ ఇచ్చాడు ఏఎన్నార్‌. అది విన్న నాగార్జునకి చిర్రెత్తిపోయింది. ఆ సమయంలో మంచి రొమాంటిక్ సినిమాలు, గ్లామర్‌, కమర్షియల్‌ ఎలిమెంట్లు, రాఘవేంద్రరావు మార్క్ రొమాన్స్ ట్రెండ్‌ నడుస్తున్నాయి. ఆ సమయంలో తనని పట్టుకొని కొంచెం వల్గారిటీ ఎక్కువ అవుతుందని ఏఎన్నార్‌ చెప్పడం నాగార్జునకి నచ్చలేదు. దీంతో తండ్రికి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడట.

33
తండ్రికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన నాగార్జున

`నాన్న మీరు మిగతా సినిమాలు చూడటం లేదు. మీరు నాగయ్యగారు, నారాయణరావుగారు, ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్‌, రంగారావుతో పోటీపడ్డారు. వాళ్లకి గొడవలు లేవు, మీకు గొడవలు లేవు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వేరుగా ఉంది. నేను నా కంపిటీటర్స్ తో పోటీ పడాలి. నేను కూడా నిలబడాలి కదా. నేను దేనికీ పనికిరాకుండా పోతే, నన్ను ఎవరూ బుక్ చేయకపోతే మీరు హ్యాపీగా ఉండలేరు కదా. అందుకని వాళ్లు చేసినంత చేయకపోయినా నేనూ కొంత చేయాలి కదా అని అన్నాడు. ఆ తర్వాత నాక్కూడా అతను చెప్పింది రైటే అనిపించింది. కాలంలో వచ్చిన మార్పులకు అతను మాత్రం ఏం చేస్తాడు` అని తెలిపారు ఏఎన్నార్‌. ఇది ఆర్కే టాక్ షోలోఏఎన్నార్‌ చెప్పారు. ఆ క్లిప్ ఇప్పుడు యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories