Jailer 2 19 Days Box Office: భారీగా పడిపోయిన జైలర్‌ 2 కలెక్షన్లు.. కోలీవుడ్ కి వెయ్యి కోట్లు ఇక కలేనా?

Published : Nov 03, 2026, 07:27 AM IST

రజనీకాంత్‌ నటించిన `జైలర్‌ 2` సినిమా మూడో వారంలోనూ అదిరిపోయే వసూళ్లతో రన్‌ అయ్యింది. కానీ ఇప్పుడు భారీగా పడిపోయింది. దీంతో వెయ్యికోట్ల టార్గెట్‌ ఇక కలే అనిపిస్తోంది.

PREV
13
కోలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్‌గా జైలర్‌ 2

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, నెల్సన్‌ దిలీప్‌ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన `జైలర్‌ 2` మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో ర్యాంపేజ్‌ ఆడిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇది ప్రారంభం నుంచే బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్‌ ఆడింది. అప్పటి జోరు చూస్తుంటే ఈ చిత్రం కోలీవుడ్‌ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని అంతా భావించారు. అన్నట్టుగానే కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన `రోబో 2.0` చిత్ర లైఫ్‌టైమ్‌ కలెక్షన్లని దాటేసింది. ఆల్ టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో రజనీకాంత్‌ తన సినిమాని రికార్డులను తానే బ్రేక్‌ చేసుకున్నాడు.

23
కోలీవుడ్‌లో వెయ్యి కోట్లు కలేనా?

ఇక కోలీవుడ్‌ కి వెయ్యి కోట్ల సినిమా అనేది ఇప్పటి వరకు కలగానే ఉండిపోయింది. ఆ అరుదైన రికార్డుని `జైలర్‌ 2` సాధిస్తుందని, వెయ్యి కోట్ల టార్గెట్‌ని బ్రేక్‌ చేస్తుందని, సరికొత్త సంచలనం సృష్టిస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు చూస్తుంటే అది కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారం వరకు కలెక్షన్లు బాగానే ఉన్నాయి. కానీ సోమవారం వసూళ్లు భారీగా పడిపోయాయి. రోజుకి కనీసం ఐదు కోట్లు కూడా రాలేదు. ఇలాంటి కలెక్షన్లతో వెయ్యి కోట్లు అనేది పెద్ద సవాల్‌. ఇంకా చెప్పాలంటే అసాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే మరో రెండు రోజుల్లో `రామాయణం` రిలీజ్‌ ఉంది. మూడు రోజుల్లో సూర్య నటించిన `సీన్‌` ఉంది, అలాగే నయనతార నటించిన `మహాశక్తి` సినిమా రిలీజ్‌ ఉంది. వీటి కోసం `జైలర్‌ 2` సినిమాని థియేటర్ల నుంచి తీసేస్తారు. దీంతో వెయ్యి కోట్లు అనేది ఇంకా కలగానే మిగిలిపోనుంది.

33
జైలర్‌ 2 19 రోజుల కలెక్షన్లు.. తెలుగులో ర్యాంపేజ్‌

ఈ నేపథ్యంలో `జైలర్‌ 2` బాక్సాఫీసు వద్ద 19 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ మూవీకి ఎంత కలెక్షన్లు వచ్చాయి, తెలుగులో ఎంత రాబట్టిందనేది చూస్తే, ఈ మూవీ 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.812 కోట్లు వసూలు చేసింది. సోమవారం దీనికి ఇండియా గ్రాస్‌ నాలుగు కోట్లు, ఓవర్సీస్‌లో రూ.75లక్షలు వచ్చాయి. మొత్తంగా రూ.4.75కోట్లు వసూలు చేసింది. తమిళంలో 2.20కోట్లు, తెలుగులో రూ.43లక్షలు, కన్నడలో 17లక్షలు వచ్చాయి. హిందీలో 60లక్షలు వచ్చాయి. టోటల్‌గా లాంగ్వేజ్‌ వైజ్‌గా చూస్తే, తెలుగులో రూ.95.45కోట్లు, తమిళంలో రూ.212.15కోట్లు, కన్నడలో రూ.92.80కోట్లు, కేరళాలో 78.20కోట్లు, హిందీలో రూ.59.15కోట్లు వచ్చాయి. ఇండియా గ్రాస్‌ రూ.537.75కోట్లు, నెట్‌ రూ.459.70కోట్లు, ఓవర్సీస్‌లో రూ.274.25కోట్లు రాబట్టింది. దాదాపు రూ.600కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసుని షేక్ చేసింది. నిర్మాతకి థియేట్రికల్‌గా వంద కోట్లకుపైగా లాభాలు తెచ్చింది. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ అన్నీ లాభాలే. ఈ చిత్రం ద్వారా నిర్మాతకి ఈజీగా ఒక మూడు నాలుగు వందల కోట్లు లాభాలు అని చెప్పొచ్చు. ఈ రేంజ్‌లో లాభాలు తెచ్చిపెట్టిన సినిమా మరోటి లేదనిచెప్పడంలో అతిశయోక్తి లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories