కృష్ణుడిగా ఎన్టీఆర్ కంటే నేనే బాగా సరిపోతాను.. కారణం చెప్పిన ఏఎన్నార్, మా అమ్మ చేసిన అద్భుతం వల్లే

pratap reddy   | Asianet News
Published : Sep 20, 2021, 12:34 PM IST

వెండితెరపై అక్కినేని నాగేశ్వరరావు సాధించని ఘనత అంటూ లేదు. పౌరాణిక, జానపద, ప్రేమ కథా చిత్రాలతో  ఏఎన్నార్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై లెజెండ్ గా అవతరించారు. నేడు నాగేశ్వరరావు జయంతి.

PREV
111
కృష్ణుడిగా ఎన్టీఆర్ కంటే నేనే బాగా సరిపోతాను.. కారణం చెప్పిన ఏఎన్నార్, మా అమ్మ చేసిన అద్భుతం వల్లే

వెండితెరపై అక్కినేని నాగేశ్వరరావు సాధించని ఘనత అంటూ లేదు. పౌరాణిక, జానపద, ప్రేమ కథా చిత్రాలతో  ఏఎన్నార్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై లెజెండ్ గా అవతరించారు. నేడు నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. 

211

ఏఎన్నార్ ఇండియన్ సినీ చరిత్రలో అల్ టైం క్లాసిక్స్ అనదగ్గ చిత్రాల్లో నటించారు. దేవదాసు, ప్రేమాభిషేకం, మాయాబజార్,మిస్సమ్మ, దసరా బుల్లోడు లాంటి ఎన్నో చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులని అలరించారు. ఆయన నటనకు దిగి రాని అవార్డు అంటూ లేదు. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మ శ్రీ, పద్మ భూషణ్,పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. 

311

ఇక ఏఎన్నార్ 1991లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. అలాంటి ఏఎన్నార్ వెండితెరపై మ్యాజిక్ చేస్తే.. ఆయన రియల్ లైఫ్ లోనే మ్యాజిక్ జరిగింది. ఏఎన్నార్ స్వగ్రామం కృష్ణ జిల్లాలోని రామాపురం. 1923 సెప్టెంబర్ 20న ఆయన జన్మించారు. 

411

ఐదుగురు అన్నదమ్ములలో ఏఎన్నార్ ఒకరు. తన తల్లి అనుకోకుండా చేసిన అద్భుతం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఏఎన్నార్ పలు వేదికపై చెబుతుంటారు. తాను కష్టాన్ని నమ్ముకున్న వాడినని..కానీ కొన్నిసార్లు తన జీవితాన్ని గుర్తు చేసుకుంటే అదృష్టాన్ని కూడా నమ్మాలనిపిస్తుందని అన్నారు. 

511

ఐదుగురు అన్నదమ్ములలో ఒకరైన ఏఎన్నార్ కు తన వంతుగా 5 ఎకరాల పొలం వస్తుంది. అప్పటికి ఏఎన్నార్ వయసు 9 ఏళ్ళు. నాలుగో తరగతిలోనే చదువు ఆపేశారు. అప్పుడు మా అమ్మకు నన్ను చదివించాలా వద్దా అనే ఆలోచన ఉండేది. చదివించాలంటే డబ్బు ఖర్చవుతుంది. పొలం అమ్మాలి. 

611

ఒక వేళ చదివిస్తే పాస్ అవుతాడో లేదో.. ఉద్యోగం వస్తుందో రాదో.. ఎందుకొచ్చిన గొడవ.. పొలం ఉంటే తినడానికి అయినా ఉంటుందిలే.. అని మా అమ్మ నన్ను నాటకాల్లో చేర్పించింది. ఆరోజు మా అమ్మకు వచ్చిన ఆలోచన గొప్పది. ఒకవేళ నేను చదువుకుని ఉంటే ఓ గుమస్తా ఉద్యోగమో చేసుకుంటూ ఈ పాటికి రిటైర్ అయ్యేవాడ్ని. కానీ ఇలా మీ ముందు ఏఎన్నార్ గా నిలుచుని మాట్లాడుతున్నానను అంటే అందుకు కారణం ఆరోజు మా అమ్మకు వచ్చిన ఆలోచన అని ఏఎన్నార్ అన్నారు. 

711

ఏఎన్నార్ లా సుదీర్ఘకాలం నటనలో కొనసాగిన నటులు చాలా అరుదుగా ఉంటారు. ఏఎన్నార్ తన చిరకాల మిత్రుడు ఎన్టీఆర్ తో కలసి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అలాగే ఆయన తన తనయుడు నాగార్జునతో, చిరంజీవి, బాలకృష్ణలతో కూడా నటించారు. 

811

ఏఎన్నార్ తన జీవితంలో రాజకీయాల జోలికి మాత్రం వెళ్ళలేదు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు కూడా ఏఎన్నార్ తో కలసి స్థాపించాలని అనుకున్నారు. కానీ ఏఎన్నార్ మాత్రం ఎన్టీఆర్ కోరికని సున్నితంగా తిరస్కరించారు. దీనితో ఎన్టీఆర్ సొంతంగా పార్టీ స్థాపించారు. 

911

ఓ ఇంటర్వ్యూలో ఏఎన్నార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నన్ను కర్ణుడిగా నటించమని అడిగారు. నేను నో చెప్పాను. ఎందుకంటే ఆ పర్సనాలిటీ నాది కాదు. ఆయన దుర్యోధనుడిగా, రావణుడిగా కూడా నటించి మెప్పించారు. కానీ ఆ పాత్రలు నేను చేయలేను. మేమిద్దరం కలసి నటించాలనుకున్నప్పుడు ఇలా డిస్కస్ చేసుకునేవాళ్లం అని ఏఎన్నార్. 

1011

ఓ సందర్భంలో శ్రీకృష్ణుడిగా కూడా నటించమని నన్ను ఎన్టీఆర్ అడిగారు. కానీ నేను చేయనని చెప్పాను. ఎందుకంటే ఆ పాత్రలో ఆల్రెడీ అయన పాపులర్ అయ్యారు. వాస్తవానికి శ్రీకృష్ణుడు పాత్రలో ఎన్టీఆర్ కంటే నేనే బాగా సరిపోతాను. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆజానుబాహుడు అని ఎక్కడా లేదు. తెలివైనవాడు.. ఎత్తుకు పైఎత్తులు వేసేవాడు శ్రీకృష్ణుడు. ఆ లక్షణాలు నాలో ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు కాబట్టి ఆ పాత్ర జోలికి నేను వెళ్లలేదు అని ఎన్నార్ అన్నారు

1111

ఏఎన్నార్ చివరగా నటించిన చిత్రం 'మనం'. ఈ మూవీలో అక్కినేని వారసులంతా నటించారు. తాజా జీవితంలో సింహభాగం కెమెరా ముందే గడిపిన ఏఎన్నార్ 2014లో మరణించారు. భావితరాల నటీనటులకు ఏఎన్నార్ ఒక లైబ్రరీ. 

click me!

Recommended Stories