మరో వెబ్‌ సిరీస్‌లో సమంత.. మతిపోయే రెమ్యూనరేషన్‌..? హీరోలకే షాక్‌

First Published | Jun 14, 2021, 6:05 PM IST

సమంతకి వెబ్‌ సిరీస్‌లు కుప్పలుగా వస్తున్నాయి. సమంత క్రేజ్‌కి ఇప్పుడు సినీ ఇండస్ట్రీస్‌ అన్నీ షాక్‌ అవుతున్నాయి. ఇక ఆ అమ్మడికి ఆఫర్‌ రెమ్యూనరేషన్‌ తెలిస్తే మాత్రం హీరోలకు కూడా మతిపోతుందంటే అతిశయోక్తి కాదు. 
 

సమంత ఇటీవల డిజిటల్‌లోకి ఎంట్రీ ఇస్తూ `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`లో నటించింది. ఇందులో ఎల్‌టీటీఈ లీడర్‌గా నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి దుమ్మురేపింది. గతంలో ఎన్నడూ కనిపించని పాత్రలో సామ్‌ నటించి వాహ్‌ అనిపించింది.
సమంత చేసిన యాక్షన్‌ సీన్స్ గూస్‌బమ్స్ వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అంతగా ఫైట్స్ సీన్స్ తో రెచ్చిపోయింది. నెవర్‌ బిఫోర్‌ అంటూ రెచ్చిపోయింది. హీరోలకు సైతం ఫైట్స్ సీన్స్ లో ఝలక్‌ ఇస్తుంది సమంత.

ఈ వెబ్‌ సిరీస్‌ తెలుగు, తమిళం, హిందీలో సూపర్‌ హిట్‌ అయ్యింది. వెబ్‌ సిరీస్‌ వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ సమంత నటించిన పాత్ర మాత్రం పీక్‌లోకి వెళ్లింది. దీంతో ఆమె క్రేజ్‌ కూడా టాప్‌లెవల్‌కి చేరుకుంది. ఇప్పుడు సమంత అంటో ఫ్యాన్స్ కి ఓ పూనకంలా తయారైంది.
ఇదే క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోబోతున్నాయి పలు డిజిటల్‌, ఓటీటీ సంస్థలు. సమంతతో మరిన్ని వెబ్‌ సిరీస్‌లు తీయాలని ప్లాన్‌ చేస్తున్నాయి. తాజాగా మరో పెద్ద డిజిటల్‌ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ సమంతతో ఓ వెబ్‌ సిరీస్‌ని తీయాలని ప్లాన్‌ చేస్తుందట.
అందుకోసం ఊహించని రెమ్యూనరేషన్‌ని ఆఫర్‌ చేసిందట. దాదాపు నాలుగు సినిమాల పారితోషికం అంటే రూ. ఎనిమిది కోట్లు ఒక్క వెబ్‌ సిరీస్‌కే ఇస్తామని ముందుకొచ్చిందట. ఇది మిడిల్‌ రేంజ్‌ హీరోలకంటే ఎక్కువ పారితోషికం కావడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. సమంత నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` అమెజాన్‌లో విడుదలైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సమంత సినిమాలతోనూ బిజీగా ఉంది. ఆమె ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది.పౌరాణిక చిత్రమిది. దీంతోపాటు తమిళంలో `కాతువాకుల రెండు కాదల్‌` చిత్రంలో నయనతార, విజయ్‌ సేతుపతిలతో కలిసి నటిస్తుంది. నయన్‌ ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Latest Videos

click me!