ఒకప్పటి స్టార్ హీరోయిన్, నేటి సీరియల్ నటి... రాశి ప్రస్తుత రెమ్యూనరేషన్ వింటే షాక్ అవుతారు!

First Published Jun 14, 2021, 3:11 PM IST

బాల నటిగా కెరీర్ ప్రారంభించిన నటి రాసి దాదాపు యాభైకి పైగా సినిమాలలో హీరోయిన్ గా నటించారు. తెలుగు, తమిళ బాషలతో పాటు హిందీలో కూడా ఆమె చిత్రాలు చేయడం విశేషం. తెలుగులో పవన్, బాలకృష్ణ వంటి స్టార్స్ తో పాటు తమిళంలో విజయ్ సరసన కూడా ఆమె నటించడం జరిగింది. 
 

కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోయిన్ చేసిన రాశి ప్రేమ కోసం కెరీర్ ని కూడా వదులుకుంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అనేక మంది క్యూలో ఉంటే, అనూహ్యంగా రాశి తన అసిస్టెంట్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు.
undefined
2006తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాశి 2013లో ఏడేళ్ల తరువాత కమ్ బ్యాక్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఈ క్రమంలో లంక అనే ఓ చిత్రాన్ని నిర్మించారు ఆమె.
undefined
సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లంక మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. రాశి డీగ్లామర్ రోల్ చేయగా ఆ సినిమా రాశిని ఆర్థికంగా కూడా దెబ్బతీసినట్లు వార్తలు వచ్చాయి.
undefined
ప్రస్తుతం రాసి సీరియల్ నటిగా మారారు. కొత్తగా ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు అనే సీరియల్ లో సీరియస్ రోల్ చేస్తున్నారు. ఈ సీరియల్ బాగానే టీఆర్పీ అందుకుంటుందని టాక్. సీరియల్ కోసం రాశి రెమ్యూనరేషన్ ఇదే అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.
undefined
రాశి ప్రెజెన్స్ ఆ సీరియల్ కి ప్లస్ కావడంతో పాటు ఆమె రోల్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుందట. దీనితో రాశికి వారానికి లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారని సమచారం. ఇక అందరూ అనుకున్నట్లు తనకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవని రాశి చెప్పుకొస్తున్నారు.
undefined
స్టార్ హీరోల సరసన పదుల సంఖ్యలో సినిమాలు చేసి లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న రాశి, వారానికి లక్ష రూపాయలకు పని చేస్తున్నారంటే దారుణమే అని చెప్పాలి. ఆమె చేసిన సినిమాలకు కోట్ల సంపాదనతో సెటిల్ కావలసింది.
undefined
click me!