ఈమధ్య టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు.. పెళ్ళిళ్లు.. ప్రెగ్నస్సీలు అంటూ..శుభవార్తలు చెపుతున్నారు. అయితేన్యూ ఇయర్ సందర్భంగా డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది ఓ హీరోయిన్. తాను మరోసారి తల్లికాబోతున్నా అంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. జీరో సైజ్ సుందరి.. టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా హీరోయిన్ ఇలియాన. అవును ఈ బ్యూటీ తాజాగా మరోసారి ప్రెగ్నెస్సీతో ఉందట తాజాగా ఆమె ఏం చెప్పిందంటే..
Also Read: గేమ్ ఛేంజర్ కోసం డైరెక్టర్ శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
న్యూ ఇయర్ సందర్భంగా 2024లో తన జీవితంలో జరిగిన అనుభవాలను పంచుకుంది హీరోయిన్ ఇలియాన. ఈక్రమంలో ఆమె ఓ వీడియోను కూడా సోసల్ మీడియాలో షేర్ చేసుకుంది. గత ఏడాది జనవరి నుంచ డిసెంబర్ వరకు తన జీవితంలో ఏం జరిగిందో వివరించింది.జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తనకు కొడుకుతోనే క్షణం తీరిక లేకుండా గడిచిపోయిందని ఇలియాన చెప్పుకొచ్చింది. రోజంతా తన బాబుతోనే కాలం గడిచిపోయిందని, తెలియకుండానే ఏడాది అయిపోయిందన్నారు.
Also Read:సమంత - శోభిత కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటో తెలుసా..?
అయితే సెప్టెంబర్‌లో మాత్రం తాను రెండో సారి గర్భం దాల్చినట్లు ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించింది. ఇలా తానుప్రెగ్నెంట్ అయిన నాలుగు నెలలకు అసలు విషయం వెల్లడించింది ఇలియాన. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతే కాదు ఇలియాన పోస్ట్ కు రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు. 2025లో మీ ఇంటికి మరో బుజ్జి పాప లేదా బాబు రాబోతున్నారని కామెంట్స్ చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ మాస్క్ పెట్టుకుని, దొంగ చాటుగా థియేటర్ లో.. ఏ హీరో సినిమాలు చూసేవారో తెలుసా..?
తన ప్రియుడైన మైఖేల్ డోలన్‌ను ఇలియాన చాలా కాలం తెలియకుండా డేటింగ్ చేసింది. అసలు పెళ్లి చేసుకుందా లేదా అనే కన్ ఫ్యూజన్ లో ఉన్న టైమ్ లో ఓ సందర్భంలో తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది బ్యూటీ. అతని పోటోలు కూడా రిలీజ్ చేసింది. కొన్నేళ్ల పాటు తన భర్త గురించి వివరాలు చెప్పలేదు. 2023లో కొడుకు పుట్టిన తర్వాత తన భర్త మైఖేల్ పూర్తి ఫోటోను విడుదల చేసింది.
ఇక సినిమాల విషయానికొస్తే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమా రామ్ హీరోగా నటించిన దేవదాసుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియాన ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళ్లింది. పోకిరి, మున్నా, రాఖీ, ఆట, జల్సా, కిక్ వంటి సినిమాల్లో నటించింది.
తెలుగుతో పాటు తమిళలంలో జోరు మీదున్న ఇలియానా బాలీవుడ్‌లో బర్ఫీ మూవీకి అవకాశం వచ్చింది. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఇలియానా అక్కడే వరుస సినిమాలు చేసింది. సౌత్ ఇండస్ట్రీకి ఆమె తిరిగి రాలేదు. ఆ తర్వాత పెళ్లి, పిల్లలతో ఆమె ఇండస్ట్రీకి దూరమైంది.