పవన్ కళ్యాణ్ మాస్క్ పెట్టుకుని, దొంగ చాటుగా థియేటర్ లో.. ఏ హీరో సినిమాలు చూసేవారో తెలుసా..?

First Published | Jan 1, 2025, 7:43 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్..హీరో.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం.. ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే సాధ్యం కాదు. అటువంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్క్ పెట్టుకుని దొంగతనంగా థియేటర్ లో పబ్లిక్ తో కలిసి సినిమాలు చూశాడంటేనమ్ముతారా..? 
 

Mudhalvan Movie

అవును ఇది నిజం. ఏదో సినిమా చూస్తున్నట్టు అనిపించినా నిజంగానే నిజం. ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ సీఎం అయిన తరువాత  ప్రోటోకాల్.. సెక్యురిటీ అంటూ.. ఆయన ఎటు వెళ్లినా.. చుట్టు జనాలు ఉండే పరిస్థితి. కాని ఆయన ఆ టైమ్ లో మారువేశం వేసుకుని.. పూలు కొని తనకు ఇష్టమైన ప్రియురాలి దగ్గరకు వెళ్తాడు కదా..  అలాంటిపనే చేశాడట. పవన్ కళ్యాణ్. 

Also Read: సమంత - శోభిత కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటో తెలుసా..?

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాన్ కూడా ఆడియన్స్ గుర్తు పట్టకుండా థియేటర్ కు వెళ్ళి.. పబ్లిక్ తో కలిసి తనకు ఇష్టమైన హీరో సినిమాలు చూసి వచ్చేవాడట. అయితే అది ఇప్పుడు కాదు.. పవన్ డిప్యూటీ సీఎం అయిన తరువాత జరిగింది కాదు.

Also Read: గేమ్ ఛేంజర్ కోసం డైరెక్టర్ శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?


తాను హీరోగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోగా ఎదిగిన టైమ్ లో జరిగిందట ఇదంతా.  మంత్రులు ముఖ్యమంత్రులు ఏమో కాని.. వారికంటే ఎక్కువ క్రేజ్ సినిమావాళ్ళకు ఉంటుంది. అందుకే వారు పబ్లిక్ గా వచ్చి థియేటర్ లో సినిమా చూసే పరిస్థితి ఉండదు. ఒక వేళ సాహసం చేసినా..రీసెంట్ గా అల్లు అర్జున్ ఇష్యూ చూశారు కదా..ఎంత ఇబ్బందిపడుతున్నాడో ఆ హీరో. 

అలానే హీరోలు పబ్లిక్ లోకి వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాని వారికి కూడా పబ్లిక్ తో కలిసి సినిమా చూడాలి అని ఉంటుందికదా. అందుకే కొంత మంది హీరోలు మారు వేశం వేసుకుని వెళ్లి సినిమాలు చూసి వస్తుంటారు. అయితే ఎంత మంది ఇలా వెళ్తారో తెలియదు కాని..వెళ్లిన వారిలో ఒకరిద్దరుమాత్రం ఈ విషయాన్ని రివిల్ చేయడంతో పాటు.. కొన్ని సందర్భాల్లో పబ్లిక్ కుదొరికిపోయారు కూడా. 
 

వారిలో విజయ తో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు తన అన్న చిరంజీవి సినిమాలు పబ్లిక్ తో కలిసి.. థియేటర్ లో చూడాలి అని ఆశ ఉండేదట. చిరంజీవి సినిమలంటే పవన్ కు చాలా ఇష్టమట. ఆ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూడాలి అనుకున్నాడట. అందుకే అప్పుడప్పుడు మాస్క్ పెట్టుకుని..హెయిర్ స్టైల్ కాస్త మార్చుకుని.. పవన్ సినిమాలు వెళ్ళేవాడట. 
 

pawan Kalyan, chiranjeevi

మొదట్లో బాగానే ఉన్నా.. ఆతరువాత కాలంలో ఒకటి రెండు సార్లు కొంత మంది ఆడియన్స్ పవన్ ను గుర్తు పట్టారట. దాంతో ఇబ్బందులు ఇలానే ఎదురవుతాయని గ్రహించినపవన్.. ఇక అలా మారువేశంలో సినిమాలకెళ్ళడం మానేశారట. ఈవిషయాన్ని స్వయంగా పవన్ కళ్యాన్ రీసెంట్ గా వెల్లడించినట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!