మరో కొత్త గెటప్ లో ధనుష్, 'ఇడ్లీ కడై' ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా..?

First Published | Jan 1, 2025, 8:07 PM IST

స్టార్ హీరో  దనుష్ నటిస్తున్న 'ఇడ్లీ కడై' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ న్యూ ఇయర్  సందర్భంగా రిలీజ్ అయ్యింది. 
 

నటుడు దనుష్

స్టార్ హీరో దనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం 'రాయన్' . దనుష్ యొక్క 50వ సినిమాగా వచ్చినరాయన్ , అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలై, దనుష్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.

దనుష్ రాయన్

ఇప్పటివరకు దనుష్ పోషించిన పాత్రల కంటే, 'రాయన్' సినిమాలో తల గొరిగించుకుని, క్రూరమైన పాత్రలో కనిపించాడు. అదే టైమ్ లో చాలా ఆప్యాయంగా ఉండే అన్నయ్యగా నటించారు. ఈ చిత్రంలో దనుష్ పరిణతి చెందిన నటనను ప్రదర్శించాడు. 


ఇడ్లీ కడై' సినిమా

ఇక  ఈ చిత్రం తర్వాత, దనుష్ 'ఇడ్లీ కడై' సినిమాలో కూడా నటించారు. ఈ చిత్రంలో ఇడ్లీ అమ్మే వ్యక్తిగా దనుష్ నటించారు. ఈ సినిమా దనుష్ దర్శకత్వం వహించి, హీరోగా కూడా నటించిన నాటుగో సినిమా కావడం విశేషం ... ఆకాష్ భాస్కర్ డాన్ పిక్చర్స్ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇడ్లీ కడై తారాగణం

ఈ చిత్రంలో, దనుష్ కి జంటగా 'తిరు సినిమాలో నటించిన నిత్యా మీనన్ నటించారు. శాలిని పాండే రెండవ హీరోయిన్ గా నటించగా, అరుణ్ విజయ్ విలన్ గా నటించారని చెబుతున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, సముద్రఖని వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. జి వి ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రానికి, ప్రసన్న జి కె ఎడిటింగ్ చేయగా, కిరణ్ కౌశిక్ ఛాయాగ్రహణం అందించారు.

ఇడ్లీ కడై ఫస్ట్ లుక్

ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా నుంచి  ఫస్ట్ లుక్ ను మూవీ టీమ్ రిలీజ్ చేశారు.  ఇందులో దనుష్ రాజ్ కిరణ్ తో నిలుచున్నట్లుగా ఉంది. మరొక ఫోటోలో చేతిలో రెండు షర్టులు, ఒక చేతిలో కూరగాయల బ్యాగ్ తో నిలుచున్నట్లుగా  కనిపిస్తున్నారు. వే

ష్టి, షర్టు, భుజంపై తువ్వాలు, నుదుట బొట్టుతో దనుష్ పక్కా పల్లెటూరి వ్యక్తిగా  కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు పెరిగాయి. ఈ సినిమా వేసవి సెలవులను లక్ష్యంగా చేసుకుని ఏప్రిల్ 10న విడుదల కానుంది.

Latest Videos

click me!