ఏ తండ్రి భరించలేని కష్టం, బాధని దిగమింగుకుని నవ్విస్తున్న ముక్కు అవినాష్.. మరోసారి హౌస్ లోకి..

First Published | Oct 6, 2024, 9:57 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ముందు నుంచి నాగార్జున ఊహించని ట్విస్ట్ లు ఉంటాయని చెబుతూనే ఉన్నారు. ఆదివారం రోజు ఏకంగా 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్ లోకి ప్రవేశించబోతున్నారు. దీనితో గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 8 రీలోడ్ ఈవెంట్ నిర్వహించారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ముందు నుంచి నాగార్జున ఊహించని ట్విస్ట్ లు ఉంటాయని చెబుతూనే ఉన్నారు. ఆదివారం రోజు ఏకంగా 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్ లోకి ప్రవేశించబోతున్నారు. దీనితో గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 8 రీలోడ్ ఈవెంట్ నిర్వహించారు. ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి, టేస్టీ తేజ సెలెబ్రిటీలు గత సీజన్లలో బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీలుగా పంపిస్తూ ప్రయోగం చేస్తున్నారు. 

ఇందులో భాగంగా ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ముక్కు అవినాష్ గతంలో బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్నాడు. ఆ సీజన్ లో కూడా అవినాష్ వైల్డ్ కార్డు రూపంలోనే హౌస్ లోకి 11 వ రోజు ఎంట్రీ ఇచ్చాడు. 91 వ రోజు వరకు హౌస్ లో ఉన్నాడు. సీజన్ 8 లో 35వ రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సీజన్ అవినాష్ కి చాలా ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అవినాష్ జబర్దస్త్ లో కమెడియన్ గా గుర్తింపు పొందాడు. 


జబర్దస్త్ లో అవకాశం రాగానే అతడి కష్టాలు తీరలేదు. చాలా సందర్భాల్లో అవినాష్ శ్రీముఖి, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళ దగ్గర ఆర్థిక సాయం పొందాడట.  కోవిడ్ సమయంలో అవినాష్ తీవ్ర మానసిక వేదన అనుభవించాడట. అయితే శ్రీముఖి, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు సహాయం చేయడంతో బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు. ముక్కు అవినాష్ కి శ్రీముఖి అంటే ప్రత్యేక అభిమానం. తాను కష్టాల్లో ఉన్న ప్రతిసారీ శ్రీముఖి ఆదుకుందని అవినాష్ తెలిపాడు. 

2021లో ముక్కు అవినాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగా జరిగి ఉంటే ఇప్పటికే ముక్కు అవినాష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యేవారు. కానీ అవినాష్, అనూజ జీవితంలో విషాదం చోటు చేసుకుంది. అనూజ గర్భవతి అయింది. సీమంతం వేడుకని కూడా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. కొద్దీ రోజుల్లోనే అవినాష్, అనూజ తల్లిదండ్రులు అవుతారు అనగా విషాదం చోటు చేసుకుంది. శిశువు గర్భంలోనే మరణించింది. ప్రసవానికి కొన్ని గంటల ముందు ఇలా జరిగిందట. 

ఏ భర్తకి అయినా, తండ్రికి అయినా ఇది భరించలేని విషాదం అని చెప్పొచ్చు. బిడ్డ ఉమ్మనీరు తాగడం వల్ల ఇలా తిరిగింది అని వైద్యులు తెలిపారు. ఆ సమయంలో అవినాష్ డిప్రెషన్ లోకి వెళ్ళాడట. బాబు పుడితే ఏ పేరు పెట్టాలి, పాప పుడితే ఏ పేరు పెట్టాలి అని నేను నా భార్య రోజూ సంతోషంగా కలలు కనేవారం. నా భార్య అయితే బిడ్డ గురించి చాలా ఊహించుకుంది. ఈ సంఘటన జరిగిన చాలా రోజుల పాటు అవినాష్ సతీమణి రాత్రి వేళల్లో వెక్కి వెక్కి ఏడ్చేదట. ఈ విషదాన్ని దిగమింగుకుని అవినాష్ కుటుంబం కోసం తన వృత్తిలో నిమగ్నమయ్యాడు. బుల్లి తెరపై షోలు చేస్తూ ఆడియన్స్ ని నవ్విస్తున్నాడు. ఇప్పుడు అవినాష్ కి మరోసారి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. 

Latest Videos

click me!