నేను ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకువెళ్దాం అనుకున్నాను ఇప్పుడు గొడవ పడితే ఇంకా దూరం పెరిగిపోతుంది అని మనసులో అనుకొని, తెలీక అన్నాను నన్ను క్షమించు అంకితం అని చెప్తాడు అభి. అంకిత అక్కడి నుంచి చిరాకుగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో లాస్య నందులు ఎయిర్ పోర్ట్ కి వస్తారు. ఆ సమయంలో తులసి సామ్రాట్ లు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉండగా లాస్య నందుని, చూడు వీళ్ళు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో అని రెచ్చగొడుతుంది. సామ్రాట్ దగ్గరకు వెళ్తారు ఇద్దరు.అప్పుడు లాస్య, నేను వచ్చాను అని షాక్ అయ్యారా అని అంటుంది. దానికి సామ్రాట్, లేదు ఇంఫాక్ట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా మంది భర్తలు వారి భార్యలను టూర్ తీసుకెళ్లడానికి ఒప్పుకోరు.