అయితే ఈ వార్తలపై అంజలి స్పందిస్తూ.. వాటిలో నిజం లేదని, ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని వెల్లడించింది. అయితే పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటానని, సమయం వచ్చినప్పుడు అందరికీ తప్పకుండా చెబుతానని పేర్కొంది. దీంతో అంజలి పెళ్ళి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.