అప్పుడు యష్ ఆదిత్యకు నచ్చచెప్పడానికి ప్రయత్నించగా నువ్వు వదులు దూరంగా వెళ్ళు అని అంటాడు. నువ్వు నన్ను చీట్ చేసావు ఐ హేట్ యు అని అంటాడు. ఆ తర్వాత బాధపడుతూ ఉండగా వేద అక్కడికి వెళ్లి నువ్వు చెప్పింది నిజమే వేద నువ్వు గుడిలో అన్నమాట తలుచుకొని ఆదిత్య విషయంలో నేను మళ్ళీ అదే తప్పు చేయాలనుకోవడం లేదు అందుకే ఇలా చేశాను అని అంటాడు. అప్పుడు వేద బాధపడుతూ ఉండగా వేద ఓదారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత వేద అక్కడి నుంచి వెళుతుండగా ఇంతలో మాళవిక అక్కడికి వచ్చి ఎంత జిత్తుల మారి నక్క వి నువ్వు చెప్పేవన్నీ నీతులు చేసేవన్నీ మోసాలు అంటూ వేద గురించి నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది మాళవిక. మంచి దానిలా నటించి యశోదర్ మాయ చేసి నా కొడుకుని జైలుకు పంపించావు అనే కోప్పడుతూ ఉంటుంది. నా కొడుకుని నాకు దూరం చేసావు నీ భర్త యశోదర్ ని నకు కాకుండా దూరం చేస్తాను అనడంతో ఆ మాటలు మాలిని,సులోచన, యష్ విని షాక్ అవుతారు.