Anirudh Controversy : వై దిస్ కొలవెరి... ధనుష్‌ను పట్టించుకోని అనిరుధ్? కృతజ్ఞత మరచిపోయాడా ?

Published : Nov 16, 2026, 08:00 PM IST

Anirudh Controversy: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వివాదంగా మారింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
వివాదంలో అనిరుధ్

ప్రస్తుత తరంలో అగ్రశ్రేణి సంగీత దర్శకుల్లో అనిరుధ్ రవిచందర్ ఒకరు. ఆయన మ్యూజిక్ కు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఇటీవల తన ప్రయాణం గురించి పెట్టిన పోస్ట్ వివాదాస్పదమైంది.

సంగీత దర్శకుడిగా 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, తన ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలను, అవకాశాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ 15 ఏళ్లలో ఎన్నో సంతోషాలు, ఆశ్చర్యాలు చూశానని, అయితే అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైందని అనిరుధ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

25
15 ఏళ్ల క్రితం మొదలైన ప్రయాణం

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో, ధనుష్ హీరోగా వచ్చిన '3' సినిమాతో అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. 2011లో వచ్చిన 'వై దిస్ కొలవెరి డి' పాట ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటతో అనిరుధ్‌కు భారీ గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఎదిర్ నీచల్, వేలైఇల్లా పట్టధారి, కత్తి, మాస్టర్, విక్రమ్, జైలర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి, తన సత్తా చాటాడు.

35
అభిమానులకు అనిరుధ్ ధన్యవాదాలు

తన 15 ఏళ్ల జర్నీలో అభిమానులు చూపించిన ప్రేమను అనిరుధ్ గుర్తుచేసుకున్నాడు. తన పాటలను సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా, కాన్సర్ట్స్ కు వచ్చి సపోర్ట్ చేసిన విధానాన్ని నెమరువేసుకున్నాడు.

తమిళంలో మొదలైన తన ప్రయాణం, తెలుగు, హిందీతో సహా పలు భాషలకు విస్తరించింది. ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, మ్యూజిక్ ఆర్టిస్టులతో పనిచేసిన అనుభవాలను పంచుకున్నాడు.

45
అసలు ఆట ఇప్పుడే మొదలు!

15 ఏళ్లు పూర్తి చేసుకున్నాని ఆనందం వ్యక్తం చేసిన అనిరుధ్, ఇక్కడితో ఆగిపోయేది లేదని స్పష్టం చేశాడు. ఇంకా ఎన్నో కలలు, కొత్త ప్రయోగాలు ఉన్నాయని తెలిపాడు. అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

55
ధనుష్ పేరు ఎందుకు చెప్పలేదు?

అనిరుధ్ పెట్టిన ఈ ఎమోషనల్ పోస్ట్‌లో, తనకు తొలి అవకాశం ఇచ్చిన ధనుష్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. అనిరుధ్ తల్లిదండ్రులు అతన్ని విదేశాలకు పంపి చదివించాలనుకున్న సమయంలో, అతనికి మ్యూజిక్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి, ఇన్‌స్ట్రుమెంట్స్ కొనిచ్చి, తన సినిమాతో లాంచ్ చేసింది ధనుష్. అంత సాయం చేసిన ధనుష్ పేరును కనీసం ఒక్కసారి కూడా అనిరుధ్ ప్రస్తావించకపోవడం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. ఆయన కృతజ్ఞత మర్చిపోయాడని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories