Anirudh-kavya Wedding: సెలబ్రిటీల పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్...మొన్న సమంత, ఇప్పుడు అనిరుధ్..ఏంటీ సెల్ఫ్ రెస్పక్ట్ పెళ్లి?

Published : Nov 13, 2026, 01:38 PM IST

Anirudh-kavya Wedding: ఈ మధ్య సెలబ్రిటీలు డిఫరెంట్ గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మొన్న సమంత- రాజ్..భూతశుద్ధి వివాహం. ఇప్పుడు అనిరుధ్-కావ్యమారన్ స్వాభిమానం పద్ధతిలో పెళ్లిచేసుకున్నారు. దీని వెనుక 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంతకీ ఏంటీ పద్ధతి?

PREV
14
'స్వాభిమానం వివాహం'

పెళ్లి అంటే పంతులు ఉండాలి.. వేద మంత్రాలు వినిపించాలి.. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడవాలి.. ఇదే మనకు తెలిసిన పెళ్లి పద్ధతి. కానీ ఇవేవీ లేకుండానే పెళ్లి జరుగుతుందా? దండలు, గొలుసులు మార్చుకుని పెళ్లి చేసుకోవచ్చా? సంగీత దర్శకుడు అనిరుధ్, కావ్య మారన్ వివాహంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అసలు ఈ స్వాభిమానం వివాహం అంటే ఏమిటి? దీని చరిత్ర ఏంటి?

ఈ పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది వారి వివాహ పద్ధతి. సాధారణంగా హిందూ సంప్రదాయ వివాహాల్లో కనిపించే వేద మంత్రాలు, పురోహితులు, అగ్నిసాక్షిగా జరిగే క్రతువులు ఈ వేడుకలో కనిపించలేదు. బదులుగా వధూవరులు దండలు, గొలుసులు మార్చుకుంటూ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ వివాహం 'స్వాభిమానం వివాహం' పద్ధతిలో జరిగినట్లు పెళ్లికి హాజరైన ఓ డీఎంకే నేత ఎక్స్ లో చెప్పారు. దీంతో అసలు ఈ స్వాభిమానం వివాహం అంటే ఏమిటి? అనే చర్చ మొదలైంది.

24
స్వాభిమానం వివాహం అంటే ఏమిటి?

స్వాభిమానం వివాహం లేదా Self-Respect Marriage అనేది తమిళనాడులో పుట్టుకొచ్చిన ఒక సామాజిక సంస్కరణ ఉద్యమంలో భాగం. ఈ వివాహ పద్ధతికి పునాది వేసింది ప్రముఖ సామాజిక సంస్కర్త ఈవీ రామసామి పెరియార్. 1920లో తమిళ సమాజంలో కుల వివక్ష, సామాజిక అసమానతలు, మహిళలపై వివక్ష వంటి సమస్యలు తీవ్రంగా ఉండేవి. అప్పట్లో వివాహ వేడుకల్లోనూ కులం, మతం, పురోహితుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఈ పరిస్థితులను ప్రశ్నిస్తూ పెరియార్ స్వాభిమానం ఉద్యమాన్ని ప్రారంభించారు. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జీవితానికి సంబంధించిన నిర్ణయమని, దానికి కులం లేదా మతపరమైన ఆచారాలు అడ్డంకిగా ఉండకూడదని ఆయన భావించారు. ఈ ఆలోచనల నుంచే 1928లో స్వాభిమానం వివాహాలు ఆచరణలోకి వచ్చాయి.

34
ఈ పెళ్లిలో ప్రత్యేకత ఏమిటి?

సాధారణ వివాహాలకు భిన్నంగా ఈ పద్ధతిలో పురోహితుడు ఉండాల్సిన అవసరం లేదు. వేద మంత్రాలు చదవాల్సిన నిబంధన కూడా లేదు. వధూవరులు పరస్పరం ఇష్టపూర్వకంగా ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా అంగీకరిస్తారు. దండలు మార్చుకోవచ్చు. ఉంగరాలు లేదా గొలుసులు మార్చుకోవచ్చు. తమ వివాహ బంధంపై ప్రమాణం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సాక్షుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించుకోవచ్చు. అంటే ఇక్కడ సంప్రదాయం కంటే ఇద్దరి పరస్పర అంగీకారం, సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యం.

44
చట్టబద్ధమైన గుర్తింపు ఎప్పుడు వచ్చింది?

ఈ వివాహ పద్ధతికి తమిళనాడులో చట్టపరమైన గుర్తింపు కూడా ఉంది. 1967లో తమిళనాడు ప్రభుత్వం హిందూ వివాహ చట్టంలో సవరణ తీసుకొచ్చింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7-A ద్వారా స్వాభిమానం వివాహాలకు చట్టబద్ధత కల్పించారు. ఈ నిబంధన ప్రకారం వధూవరులు ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా అంగీకరించడం, దండలు లేదా ఉంగరాలు మార్చుకోవడం వంటి పద్ధతుల ద్వారా వివాహం చేసుకోవచ్చు.

గతంలో కూడా సమంత- రాజ్ డీకే..భూతశుద్ధి వివాహం చేసుకున్నారు. ఈశా ఫౌండేషన్ లో ఎలాంటి హంగు ఆర్భాటాల్లేకుండా పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతి కాకుండా ఈ పద్ధతిని ఎంచుకున్నారు. ముహూర్తాల హడావుడి లేకుండా చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories