ఎన్టీఆర్‌ సినిమాలో `యానిమల్‌` స్టార్స్.. నేషనల్‌ కాస్టింగ్‌ని దించుతున్న ప్రశాంత్‌ నీల్‌ ? ప్లాన్‌ పెద్దదే

Published : Jun 21, 2024, 01:10 PM IST

ఎన్టీఆర్‌ సినిమాలో ఆ క్రేజ్‌ బ్యూటీ కనిపించబోతుందట. అంతేకాదు `యానిమల్‌` స్టార్స్ ని దించుతున్నాడు దర్శకుడు ప్రశాంత్‌నీల్. ఇదే ఇప్పుడు మరింత క్రేజీగా మారింది.   

PREV
17
ఎన్టీఆర్‌ సినిమాలో `యానిమల్‌` స్టార్స్.. నేషనల్‌ కాస్టింగ్‌ని దించుతున్న ప్రశాంత్‌ నీల్‌ ? ప్లాన్‌ పెద్దదే

ఎన్టీఆర్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా బిజీగా ఉన్నాడు. ఓ వైపు తన సొంత మూవీ `దేవర`లో నటిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా ఇది రూపొందుతుంది. ప్రస్తుతం థాయిలాండ్‌లో సాంగ్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ మూవీ సెప్టెంబర్‌లోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 
 

27
War 2

దీంతోపాటు బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ మరో హీరోగా రూపొందుతున్న చిత్రమిది. యాష్‌రాజ్‌ ఫిల్మ్ స్పై యాక్షన్‌ మూవీగా రూపొందుతుంది. ఇందులో ఎన్టీఆర్‌ ది నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర అని తెలుస్తుంది. ఇప్పటికే కొంత పార్ట్‌ షూటింగ్‌ అయ్యింది. తారక్‌ రెండు మూడు షెడ్యూల్స్ లో పాల్గొన్నాడు. కీలక యాక్షన్‌ సీక్వెన్స్ చిత్రీకరించినట్టు తెలుస్తుంది. 
 

37

మరోవైపు యంగ్‌ టైగర్‌ మరో సినిమా ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది. `కేజీఎఫ్‌`, `సలార్‌` చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమాచేయబోతున్నారు. ఎన్టీఆర్‌ 31గా ఇది రూపొందనుంది. ఆగస్ట్ నుంచి దీన్ని ప్రారంభించబోతున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాస్టింగ్‌ ఎంపిక జరుగుతుందట. అందులో భాగంగా ఓ క్రేజీ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. 
 

47

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీలో హీరోయిన్‌గా నేషనల్‌ క్రష్‌ని తీసుకుంటున్నారట. చాలా రోజులుగానే ఆమెపేరు వినిపించినా, అది రూమర్‌గానే ఉండిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్‌ అయ్యిందని అంటున్నారు. ఇదే నిజమైతే ఎన్టీఆర్‌ సరసన మొదటిసారి రష్మిక మందన్నా కనిపించబోతున్నట్టు చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఆ మధ్య ఎన్టీఆర్‌ గురించి చెప్పింది రష్మిక, ఆయన డాన్సులు అదిరిపోయేలా ఉంటాయని, ఆ డాన్స్ లకు తాను అభిమాని అని తెలిపింది. ఆయనతో పని చేయాలని ఉందని చెప్పింది. ఇప్పుడు వెంటనే సినిమా చేసేందుకు రెడీ అవుతుంది. 
 

57

దీంతోపాటు మరో `యానిమల్‌` స్టార్‌ని దించుతున్నాడు ప్రశాంత్‌నీల్‌. విలన పాత్ర కోసం బాబీ డియోల్‌ని ఎంపిక చేశారట. `యానిమల్‌` చిత్రంతో బాబీ డియోల్‌ నేషనల్‌ వైడ్‌గా సెన్సేషన్‌గా మారారు. దెబ్బకి వరుసగా ఆయనకు తెలుగులో,సౌత్‌లో ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌తో `హరిహర వీరమల్లు`లో నటిస్తున్నాడు. బాలకృష్ణ `ఎన్బీకే 109`లోనూ విలన్‌గా చేస్తున్నాడు. అలాగే సూర్య `కంగువా`లోనూ ఆయనే విలన్‌.

67
Kajal Aggarwal

ఇప్పుడు ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీలోనే విలన్‌గా బాబీ డియోల్‌ని ఫైనల్‌చేశారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇదే నిజమైతే ఇక ఎన్టీఆర్‌ సినిమా రేంజ్‌ అమాంతం పెరిగిపోతుంది. పాన్‌ ఇండియా సినిమాల్లో అత్యంత క్రేజీ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. 
 

77

ప్రస్తుతం రష్మిక మందన్నా కూడా ఫుల్‌ బిజీగా ఉంది. ఆమె ఇప్పటికే ఆరు సినిమాలు చేస్తుంది. తెలుగులో `పుష్ప 2`లో నటిస్తుంది. దీంతోపాటు `ద గర్ల్ ఫ్రెండ్`, `రెయిన్‌బో`, `కుబేర`తోపాటు హిందీలో సల్మాన్‌ తో `సికిందర`, అలాగే మరో సినిమాలో ఆమె కనిపించబోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమా కూడా తన జాబితాలో చేరింది. ఇలా ఏడు ప్రాజెక్ట్ లతో అత్యంత బిజీ హీరోయిన్‌గా, నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది రష్మిక మందన్నా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories