టేస్టీ తేజ కు దమ్ములేదా..? విరుచుకుపడిన కన్నడ బ్యాచ్.. నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే..?

First Published | Nov 11, 2024, 11:43 PM IST

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల యుద్దం ముగిసింది. వారం వారం  జనాలు తగ్గుతుండటంతో.. నామినేషన్ల వేడి కూడా పెరుగుతూ వస్తోంది. ఇక ఈవారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..? 

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లు  డే గడిపిచిపోయింది. హౌస్ లో హరితేజ ఎలిమినేషన్ తరువాత టాప్ 10 బ్యాచ్ మిగిలారు. ఇక్కడి నుంచి ఎలిమినేషన్ చాలా టఫ్ అవ్వబోతోంది. ఈవారం కూడా  చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్లకు కూడా పెద్ద యుద్దమే జరిగింది. అందులో మరీ ముఖ్యంగా టేస్టీ తేజను టార్గెట్ చేసుకుని కన్నడ బ్యాచ్ 
 

గట్టిగా ఇచ్చిపడేశారు. అయితే అందులో తేజ చేసిన తప్పుకూడా ఉంది. గత వారం సిల్లీ నామినేషన్ వేసిన తేజ.. ఆతరువాత గుడ్డు టాస్క్ లో ఏం చేశాడో అందరు చూశారు. అయితే ఈ విషయంపై తేజను నామినేట్ చేయడం పెద్ద తప్పేమి కాదు. కాని అతనిలో చాలా ప్రస్టేషన్లు ఉన్నాయి. హౌస్ అంతా తనను వరస్ట్ ప్లేయర్ అన్నారు.

 ఇంట్లో వాళ్లు హౌస్ లోకి రాకుండా బిగ్ బాస్ పనిష్ చేశారు. ఈ ప్రస్టేషన్ లో నిఖిల్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆతరువాత ఫృద్వీతో.. ఆతరువాత యష్మితో.. ఇలా వరుసగా వాదోపవాదాలు.. అరుపులతోబిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది. అంతే కాదు నిఖిల్ తేజాను నామినేట్ చేయగా.. తేజ యష్మిని నామినేట్ చేశారు. 
 


దాంతో వీరిమధ్య గోల మామూలుగా జరగలేదు. ఇక ఆతరువా గౌతమ్ పృధ్వీని నామినేట్ చేయగా.. గౌతమ్ చెప్పిన పాయింట్స్ ను అలా ఊది పడేశాడు పృధ్వీ. అందులో పసలేదని.. ఫూక్ నామినేషన్ అనిప్రూ చేశాడు. కవర్ చేసుకోలేక గౌతమ్ అది నా అభిప్రాయం అంటూ బుకాయించాడు. 

ఇక పృధ్వీ మాత్రం అవినాష్ ను నామినేట్ చేస్తూ.. సిల్లీ రీజన్స్ ను చెప్పాడు. చీఫ్ గా ఉన్నప్పుడు ఫుడ్ లేట్ అయ్యిందని. గేమ్ లో సంచాలక్ గా ఫెయిల్ అయ్యావని. సో ఈ విషయంలో అవినాష్ కూడా డిపెన్స్ చేసుకున్నాడు. ఎందకంటే పృధ్వీ అండ్ బ్యాచ్ అంటే ఇష్టం లేని కొంత మంది సపరేట్ అయ్యారు

వారు అవినాష్ ఏది అంటే దానికి తానా తందానా అంటున్నాడు. ఇక రొహిణి వచ్చిన దగ్గర నుంచి విష్ణు ప్రియను టార్గెట్ చేసుకుంది. అనుకున్నట్టుగానే రొహిణి విష్ణును నామినేట్ చేసింది. తనకు గేమ్ లో సపోర్ట్ చేయలేదు అంటూ.. దానికి విష్ణు కూడా చాలా తెలివిగా డిఫెన్స్ చేసుకుంటూ వచ్చింది. 

ఇక ఫైనల్ గా ఈవారం నామినేషన్లలో గౌతమ్, టేస్టీ తేజ,  యష్మి, నిఖిల్, పృధ్వీ, విష్ణు ప్రియ. ఈ ఆరుగురు ఈ వారం నామినేషన్స్ లో నిలిచారు. ఇక  ఈవారం చాలా పెద్ద టఫ్ ఫైట్ అనే చెప్పాలి. మరి అందులో ఎవరు హౌస్ లో ఉంటారు..ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయేది ఎవరు అనేది చూడాలి.  
 

Latest Videos

click me!