డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. స్కూల్ కు వెళ్తూ.. పోస్టర్ చూసి.. ఏం చేసేవాడంటే..?

First Published | Oct 11, 2024, 7:00 PM IST

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఆ హీరోయిన్ అంటే అంత పిచ్చి ఎందుకు..? ఆమె అంటే క్రష్ ఉందా..? చిన్నప్పుడు స్కూల్ కు వెళ్తూ.. ఆ బ్యూటీ పోస్టర్లు చూసి ఆయన ఏం చేసేవాడో తెలుసా..? 
 

టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుల్లో  రాజమౌళి తరువాత ఆ క్రెడిట్ అనిల్ రావిపూడికే వస్తుంది. చిన్న దర్శకుడితా సత్తా చాలి.. పెద్ద హీరోల చేతిలో పడ్డాడు అనిల్. మహేష్ బాబులో చేసిన సరిలేరు నీకెవ్వరు మూవీతో స్టార్ డైరెక్టర్ల సరసన చేరిపోయాడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. బిజీ దర్శకుడిగా మారడు అనిల్ రావిపూడి. 

Also Read: పవన్ కళ్యాణ్ తో గొడవ పై బాలయ్యకు క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్

కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ తో మొదలైన అనిల్ రావిపూడి విజయ పరంపర... రీసెంట్ గా బాలయ్య బాబులో చేసిన భగవంత్ కేసరి దగ్గర వచ్చి ఆగింది. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో చేసిన ఎఫ్2 ఎఫ్ 3 సినిమాలు అనిల్ రేంజ్ ను ఎక్కడికో లీసుకెళ్ళాయి. ఈక్రమంలో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే చేసుకుంటూ వెళ్తున్నాడు అనిల్. 
Also Read: నితిన్ దిల్ సినిమాలో నటించిన ఈ 5 గురు నటులు ఎలా చనిపోయారో తెలుసా..?


ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా.. స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పనిచేశాడు అనిల్ రావిపూడి. ఇక ఈదర్శకుడి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎలాగైతే.. హీరోయిన్ శ్రీదేవి అంటే పిచ్చిప్రేమ ఉందో.. అనిల్ రావిపూడికి కూడా ఓ హీరోయిన్ అంటే అంతే పిచ్చి ఉందట. 

Also Read: చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత హీరోయిన్ గా చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

ఇంతకీ అనిల్ రావిపూడి అంతగా ఇష్టపడే హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమె మరెవరో కాదు నగ్మ. అవును.. స్కూల్ డేస్ నుంచి నగ్మ అంటే పిచ్చి ఇష్టం ఉండేదట అనిల్ రావిపూడికి. తాను టెన్త్ చదువకునే రోజుల్లో స్కూల్ కు వెళ్తూ.. నగ్మ పోస్టర్లు చూసి.. అలాగే ఆగిపోయేవాడట. ఎంటి ఇంత అందంగా ఉంది అనుకుంటూ.. పోస్టర్లను చూస్తునే నగ్మను ప్రేమించేవాడట. 

Also Read:  బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

Actress nagma and Ganguly

అంత ఇష్టమట నగ్మ అంటే. ఈ విషయాన్ని ఓ సందర్భంలో.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో వెల్లడించారు అనిల్ రావిపూడి. ఇక ఆయన సినిమాల్లోకి వచ్చే టైమ్ కు నగ్మ హీరోయిన్ గా రిటైర్ అయ్యారు. రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా.. పెళ్ళి కూడా చేసుకోకుండా సింగిల్ గా బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్నారు నగ్మ. 

Also Read: రజినీకాంత్, కమల హాసన్ తో నటించనని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Nagma

నార్త్ లో పుట్టిపెరిగిన నగ్మ.. సౌత్ హీరోయిన్ గా స్టార్ డమ్ చూసింది. తెలుగు తమిళ భాషల్లో నగ్మ.. ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లతో సినిమాలు చేసి మెప్పించింది బ్యూటీ. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ జోడీగా నగ్మ నటించిన భాషా సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. 

Jyothika and Nagma

ఆమె చెల్లెలు జ్యోతికా మాత్రం తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమించి... పెళ్ళాడి.. చెన్నైలో సెటిల్ అయ్యింది. రీసెంట్ గా సూర్యతో పాటు ఆమె కూడా ముంబయ్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!