Ram, Anil Ravipudi Combo Missed : వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. స్టార్ హీరో రామ్ తో సినిమా మిస్ అయ్యాడట. అనౌన్స్ మెంట్ తరువాత ఆగిపోయిన ఆ సినిమా ఏదో తెలుసా..?
టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరుంది అనిల్ రావిపూడికి. రాజమౌళి తరువాత ఆ రికార్డ్ అనిల్ దే. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు అనిల్. సంక్రాంతికి వస్తున్నాం సినిమతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి.. దాదాపుగా 300 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
అంతకు ముందు అనిల్ చేసిన సినిమాలు కూడా మంచి సక్సెస్ లను అందించాయి. పటాస్ తో దర్శకుడిగా మొదలైన అనిల్ ప్రస్థానం ప్రశాంతంగా సాగుతుంది. అయితే మధ్యలో హీరో రామ్ తో మాత్రం ఓ సినిమా మిస్ అయ్యిందట. అయితే రామ్ తో మనస్పర్ధల కారణంగానే ఈసినిమా ఆగిపోయింది అనేవారు కూడా ఉన్నారు. అయితే అసలు ఈసినిమా ఎందుకు ఆగిపోయిందనే విషయం అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తోంది.
రామ్ హీరోగా నటించిన కందిరీగ, మసాలా, పండగ చేస్కో సినిమాలకు రచయితగా పనిచేసాడు అనిల్ రావిపూడి. ఆ టైమ్ లో ఇద్దరు మంచి స్నేహితులుగా మారారట. రెండు సినిమాల తర్వాత రాజా ది గ్రేట్ సినిమా మొదట రామ్ తోనే చేయాలనుకున్నాడట. కథ రాయడం.. రామ్ కు చెప్పడం కూడా జరిగిపోయిందట. రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు.
45
Ram Pothineni
అయితే ఈ కథ రామ్ కోసం యాక్షన్ బేస్ గా రాసుకున్నారట. సరిగ్గా అప్పుడు రామ్ వరుసగా మూడు నాలుగు సినిమాలు యాక్షన్ వి చేశాడట. అందులో కొన్ని ప్లాప్ అవ్వడంతో.. అనిల్ తో రామ్ ఇలా అన్నాడట. మళ్ళీ యాక్షన్ సినిమా చేయడం కరెక్ట్ కాదేమో.. అనిల్ కొన్నిరోజులు ఆగుదాం. అని అన్నాడట. దాంతో అనిల్ కూడాసరే అన్నాడట.
55
రాజా ది గ్రేట్
దాంతో మూవీస్టార్ట్ కాకముందే ఆగిపోయింది. ఇక ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. రవితేజకు సరిపోను కథను రాసుకుని.. రాజా ది గ్రేట్ సినిమాను చేసి హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఇలా రామ్ తో అనిల్ రావిపూడి తో రామ్ సినిమా ఆగిపోయింది. ఇక ముందు రామ్ తో అనిల్ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.