Lucky Baskhar : అద్భుతం చేసిన లక్కీ భాస్కర్.. ప్రభాస్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని కూడా తొక్కేశాడు

Published : Jan 31, 2025, 07:55 PM IST

Lucky Baskhar and Kalki 2898 AD movies : టీఆర్పీ రేటింగ్ విషయంలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చిత్రం అద్భుతం చేసింది. ప్రభాస్ కల్కి చిత్రానికి కూడా షాక్ ఇచ్చింది.   

PREV
14
Lucky Baskhar : అద్భుతం చేసిన లక్కీ భాస్కర్.. ప్రభాస్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని కూడా తొక్కేశాడు
Lucky Baskhar

Lucky Baskhar vs Kalki 2898 AD : 2024 టాలీవుడ్ లో గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. హను మాన్, కల్కి, పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రాలు గత ఏడాదే రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన మరో చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 

24
Dulquer Salmaan

గత ఏడాది అందరినీ థ్రిల్ చేసిన చిత్రం ఇది. వెంకీ అట్లూరి బ్యాంకింగ్ వ్యవస్థపై, అవినీతిపై ఈ చిత్రాన్ని రూపొందించారు. లక్కీ భాస్కర్ చిత్రం మరోసారి అద్భుతం చేసింది. ఏకంగా ప్రభాస్ కల్కి చిత్రాన్ని బీట్ చేస్తూ అరుదైన ఘనత సాధించింది. 

 

34
Kalki 2898 AD

కల్కి చిత్రాన్ని తొలిసారి టీవీల్లో ప్రదర్శించగా అత్యంత దారుణంగా 5 టిఆర్పి రేటింగ్ ని మాత్రమే ఈ చిత్రం సాధించింది. స్టార్ హీరోల చిత్రాలకు టిఆర్పి రేటింగ్స్ 20 దాటిన సందర్భాలు ఉన్నాయి. పుష్ప 1, సరిలేరు నీకెవ్వరు లాంటి చిత్రాలు 20కి పైగా రేటింగ్ సాధించాయి. కానీ కల్కి కేవలం 5 కి మాత్రమే పరిమితం కావడంతో అంతా షాక్ అయ్యారు. 

44
Prabhas

ఇప్పుడు లక్కీ భాస్కర్ చిత్రం కూడా కల్కి చిత్రాన్ని బీట్ చేస్తూ 8.4 రేటింగ్ సాధించింది. దుల్కర్ సల్మాన్ తెలుగులో స్టార్ హీరో కాదు. అతడి క్రేజ్ తో పోల్చుకుంటే ఇది అద్భుతమైన రేటింగ్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయి. టీవీల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రాలకు ఆదరణ ఉంటుందని మరోసారి రుజువైంది. 

Read more Photos on
click me!

Recommended Stories