అనిల్ రావిపూడి ఈ పార్టీలో మాట్లాడుతూ చంద్రబాబు, నారా భువనేశ్వరి గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు. భువనమ్మ గారు ఏవండీ ఒకసారి పైకి రండి అని పిలిస్తే.. చంద్రబాబు గారు సామాన్యుడిలా వచ్చారు. భువనమ్మగారు ఆయనకి కండిషన్ కూడా పెట్టారు.. ఇది రాజకీయ సభ కాదు కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి అని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను, డైరెక్టర్ బాబీ అనుకున్నాం.. ఈ ఈవెంట్ కి మనం మన భార్యలతో రాలేదు సేఫ్ అని లేకుంటే.. మాకు చంద్రబాబు గారిని ఉదాహరణగా చూపించేవారు అని అనిల్ రావిపూడి ఫన్నీ కామెంట్స్ చేశారు.