అదే ఇలాకాలో వాళ్ల అన్నయ్య నిన్ను ఇలా చంపుతా, అలా చంపుతా అనే రికార్డు ఉంది. మనం చేసి వాళ్లపైకి తోసేద్దాం. శేఖర్ బాషాని కొట్టారనేది అన్విక మీదకు వెళ్తుందని, అతన్ని కొట్టించండి, నేను కూడా వ్యభిచారం కేసు పెడతాను అని చెప్పింది లక్ష్మి.
కొట్టించి చంపేశాక ఓ వ్యక్తిని ముందు పెట్టి తానే కొట్టించాను, అతను నా చెల్లిని చంపేశాడు, ఆమెపేరే మౌనికా అని చెప్పిందామని పడాల లక్ష్మి చింటుకి చెప్పడం గమనార్హం. ఈ కేసులో మహా అయితే ఎఫ్‌ఐఆర్ అవుతుంది. అరెస్ట్ కాకుండా తప్పించుకుంటాం. ఆ కేసుని విచారించే ఎస్‌ఐ, సీఐని తాను మ్యానేజ్ చేస్తానని, ఆయనతో తాను మాట్లాడతానని తెలిపింది లక్ష్మి.
ఇదంతా ఈజీ కాదు, తాను కొట్టి చంపడానికి నేనేమైనా హీరోనా, సూపర్ మ్యాన్‌నా అంటూ, తన వల్ల కాదని చెప్పాడు చింటు. అయితే తాను కొట్టించి క్లోజ్ చేస్తాను, నాకు బడ్జెట్ ఇప్పిస్తారా అంటూ అడిగింది పడాల లక్ష్మి. వాన్ని కొట్టే కొట్టుడికి విజ్ఞాన్ గాడు, దాసరిగాడు రివర్స్ చెప్పేలా చేస్తామని చెప్పింది.
ఇక చివరగా లక్ష్మి మనం ఏదైనా చేయాలనుకుంటే ఎవరితోనూ చెప్పొద్దు, నేను ఎవరితోనూ చెప్పను అని అనడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట దుమారం రేపుతుంది.
Note: `ఆర్‌టీవీ` దీన్ని టెలికాస్ట్ చేసింది. ఈ వార్తని ఏషియా నెట్ ధృవీకరించడం లేదు.