టాలీవుడ్ లో చరిత్ర సృష్టించే చిత్రాలు అప్పుడప్పుడూ రిలీజ్ అవుతుంటాయి. గతంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు తమ చిత్రాలతో టాలీవుడ్ మార్కెట్ ని, బిజినెస్ వాల్యూని పెంచుతూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అనేక ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటించారు. వాటిలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఘరానా మొగుడు చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.