అమీర్‌ ఖాన్‌ గర్ల్ ఫ్రెండ్‌ ముంబయిలో హల్‌చల్‌.. ఫోటోగ్రాఫర్లని చూసి పరార్‌

Published : May 25, 2025, 10:23 PM IST

అమీర్‌ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఫోటోగ్రాఫర్లని చూసి ఆమె వెనుదిరిగి వెళ్లిపోతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. 

PREV
16
కెమెరాలకు చిక్కిన అమీర్‌ ఖాన్‌ గర్ల్ ఫ్రెండ్‌

ముంబైలో అమీర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ కనిపించారు. కెమెరామెన్లని చూసి ఆమె వెనుతిరిగి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

26
గౌరీ స్ప్రాట్‌ వీడియో వైరల్‌

మే 25న ముంబైలో గౌరీ స్ప్రాట్ కనిపించారు. ఆమె ఏదో పని మీద బయటకు వచ్చారు. కానీ అక్కడ ఆమెని ఫోటోలు తీస్తున్నారనే విషయం గమనించింది. దీంతో సైలెంట్‌గా వెనుదిరిగి వెళ్లిపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.  ఇది అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 

36
ఇటీవలే ప్రియురాలిని పరిచయం చేసిన అమీర్‌ ఖాన్‌

అమీర్‌ ఖాన్‌, గౌరీ స్ప్రాట్ గత కొద్ది కాలంలో ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇటీవలే ఈ విషయం బయటపడింది. ఈ ఇద్దరు కలిసి బయట కనిపించడంతో ఈ పుకార్లు వ్యాపించాయి. పైగా కలిసి ఈవెంట్లలో పాల్గొన్నారు. ఇద్దరు క్లోజ్‌గా మూవ్‌ అయ్యారు. దీంతో అమీర్‌, స్ప్రాట్‌ ప్రేమలో ఉన్నారనే విషయం స్పష్టమయ్యింది. 
 

46
గౌరీ స్ప్రాట్‌కి ఆరేళ్ల కొడుకు

 ఇక గౌరీ స్ప్రాట్ బెంగళూరులో నివసిస్తున్నారు. ఆమె అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమెకు ఆరేళ్ల కొడుకు ఉండటం విశేషం. అమీర్‌ కి కూడా పిల్లలున్న విషయం తెలిసిందే. కూతురు ఐరా వివాహం కూడా చేశారు.

56
25ఏళ్లుగా అమీర్‌, గౌరీ ఫ్రెండ్స్

అమీర్, గౌరీలకు దాదాపు 25 ఏళ్ల స్నేహం ఉంది. ఒక ప్రాజెక్ట్ లో కలిసి పనిచేశారు. తర్వాత గౌరీ బెంగళూరు వెళ్లిపోయారు.

66
తన పుట్టిన రోజుని గౌరీని పరిచయంచేసిన అమీర్‌

తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు అమీర్‌ ఖాన్ గౌరీని మీడియాకు పరిచయం చేశారు. అయితే, ఫోటోలు తీయడానికి ఆయన అనుమతించలేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories