విష్ణుప్రియ పెళ్లి రచ్చ.. శ్రావణమాసంలో పూలు, పండ్లిచ్చి దీవించిన యాంకర్‌ సుమ, రాఘవేంద్రరావు..

Published : Aug 16, 2022, 08:46 PM IST

హాట్‌ హాట్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టించే యాంకర్‌ విష్ణు ప్రియ లేటెస్ట్ గా షాకిచ్చింది. పెళ్లి చేసుకోవాలనుకుంటూ మనసులో మాట బయటపెట్టింది. అంతేకాదు ఆమె చేసిన రచ్చ ఇప్పుడు వైరల్‌గా మారింది.

PREV
17
విష్ణుప్రియ పెళ్లి రచ్చ.. శ్రావణమాసంలో పూలు, పండ్లిచ్చి దీవించిన యాంకర్‌ సుమ, రాఘవేంద్రరావు..

యాంకర్‌గా బుల్లితెరపై రచ్చ చేసిన యాంకర్‌ విష్ణు ప్రియా(Vishnu Priya) ఇప్పుడు సినిమాలపై ఫోకస్‌పెట్టింది. అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తుంది. ఆమె కీలక పాత్రలో మెరిసిన చిత్రం `వాంటెడ్‌ పండుగాడ్‌`. కె.రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన చిత్రమిది. ఇందులో అనసూయ, సుడిగాలి సుధీర్‌, విష్ణుప్రియ, దీపికా పిల్లి, సునీల్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇందులో విష్ణుప్రియా గ్లామరస్‌ పాత్రలో కనిపించింది. 

27

ఇదిలా ఉంటే సినిమా ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అందులో భాగంగా నిత్య శెట్టి, యశ్వంత్‌ మాస్టర్, విష్ణుప్రియా, అనసూయ, కె.రాఘవేంద్రరావు కలిసి `క్యాష్‌`(Cash) ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. సుమ కనకాల యాంకర్‌గా చేస్తున్న ఈ షో ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో విష్ణుప్రియ, అనసూయ, రాఘేవేంద్రరావు చేసే రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. 

37

షోకి వచ్చీ రాగానే రచ్చ స్టార్ట్ చేసింది విష్ణుప్రియా. రెండు ఆపిల్‌ పండ్లతో ఆడుకుంటూ శ్రావణ మాసంలో తనకు రెండు పండ్లు ఇచ్చారని, పెళ్లై పండ్లతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ఇది విన్న యాంకర్‌ సుమ షాక్‌ అవ్వడం విశేషం.
 

47

దీనికి యాంకర్‌ సుమ (Suma) తోడవ్వంతో సీన్‌ మరింతగా రక్తికట్టింది. `నీకు రెండు పండ్లు ఇచ్చారు. అందులో ఒకటి నువ్వు, ఇంకోటి మీ ఆయన` అంటూ తను కూడా మరో పండు ఇచ్చింది. ఇది మీకు పుట్టబోయే బాబో, పాపో అంటూ చెప్పింది. దీంతో సీన్‌ మరింతగా రక్తికట్టింది. దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లేందుకు విష్ణు ప్రియ గట్టిగా అరుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం విశేషం. 

57

సుమకి థ్యాంక్స్ చెబుతూ, ఇక నాకు క్యాష్‌ వద్దు అని తెలిపింది విష్ణు ప్రియా. దీంతో మరో పంచ్‌తో రెచ్చిపోయింది సుమ. ఈ పండ్ల కంటే నీ పళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పడంతో షోలో నవ్వులు విరిసాయి. 

67

ఆ వెంటనే యాంకర్‌ అనసూయతో కలిసి షోకి ఎంట్రీ ఇచ్చారు కె.రాఘవేంద్రరావు. ఆయనకు గ్రాండ్‌గా స్వాగతం పలికారు. అయితే యాంకర్‌ సుమ .. రాఘవేంద్రరావుకి ఫ్లవర్‌ బొకే ఇచ్చారు. అది తీసుకున్న ఆయన బొకేని విష్ణు ప్రియ వైపు విసిరేయడం విశేషం. దీంతో ఆ బొకేని పట్టుకుంది. హమ్మయ్య పెళ్లైంది నాకు అంటూ ఎగిరి గంతులేసింది. 
 

77

ఇది విని ఆశ్చర్యపోయిన అనసూయ ఇలా విసిరేస్తే పెళ్లవుతుందా అని మరో బొకేని ఆమెకి విసిరేసింది. అది కూడా క్యాచ్‌ పట్టుకుని రెండు పెళ్లిళ్లయ్యాయని గోల చేయడం విశేషం. దీంతో షో మొత్తం నవ్వులతో కళకళలాడింది. రాఘవేంద్రరావు చేసిన సందడి మరో లెవల్‌లో ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories