Anasuya : చిలుకతో అనసూయ ముద్దులాట.. `జబర్దస్త్` యాంకర్‌ చిలిపి పనులపై నెటిజన్ల సెటైర్లు.. నెట్టింట రచ్చ రచ్చ

Published : Aug 16, 2022, 07:31 PM ISTUpdated : Aug 16, 2022, 08:49 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ గ్లామర్‌ పరంగా ఎంతగా మెస్మరైజ్‌ చేస్తుందో తెలిసిందే. అప్పుడప్పుడు సరదాగా ఆమె చేసే పనులు కూడా అంతే కొంటెగా ఉంటాయి. తాజాగా ఆమె ముద్దులాట వైరల్‌ అవుతుంది.   

PREV
18
Anasuya : చిలుకతో అనసూయ ముద్దులాట.. `జబర్దస్త్` యాంకర్‌ చిలిపి పనులపై నెటిజన్ల సెటైర్లు.. నెట్టింట రచ్చ రచ్చ

అనసూయ(Anasuya) రెగ్యూలర్‌గా హాట్‌ ఫోటో షూట్లతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తన అందాల ఫోటోలతో సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన పెంపుడు చిలుకతో చేసిన చిలిపి పని మాత్రం వైరల్‌గా మారింది. ఆ వీడియో నెట్టింట చక్కర్లుకొడుతుంది. 

28

అనసూయ ఇందులో సరదాగా రిలాక్స్ అవుతుంది. తన ఫ్యామిలీతో కలిసి రిలాక్సేషన్‌ పొందుతుంది.అందులో భాగంగా ఆమె పార్క్ లో హల్‌చల్‌ చేసినట్టు తెలుస్తుంది. తన కుమారులతోపాటు పెంపుడు జంతువులు, పక్షులతో సరదాగా కనిపించింది. 

38

ఇందులో పెంపుడు చిలుకతో అనసూయ చేసిన చిలిపి పని ఆకట్టుకోవడంతోపాటు సెటైర్లకి కారణమవుతుంది. ఇందులో ఆమె చిలుకతో కలిసి ముద్దులాటకి దిగింది. చిలుకలా తను కూడా మాట్లాడుతూ, ముద్దు పెట్టమని అడిగింది అనసూయ. తను చేసినట్టుగా చేసింది. ఆ తర్వాత చిలుకని ముద్దు పెట్టమని అడగ్గా అది ముద్దులతో రెచ్చిపోయింది.

48

అనసూయ చిలుకకి, చిలుక అనసూయకి ముద్దులిచ్చుకోవడం, ఐ లవ్‌ యూ చెప్పుకుంటూ ఉన్న వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నెటిజన్లని కట్టిపడేస్తుంది. `జబర్దస్త్` యాంకర్‌ చేసిన ఈ చిలిపి పని ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
 

58

అయితే ఇది చూసిన కుర్రాళ్లు రెచ్చిపోతున్నారు. కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. అదృష్టం అంటే చిలుకదే అని, చిలుకలా పుట్టాల్సింది అని, అనసూయలో ఇలాంటి యాంగిల్‌ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

68

మరోవైపు అనసూయ ఓ రీల్‌ వీడియోని షేర్‌ చేసింది. ఇందులో గ్రీన్‌ కలర్‌ శారీలో మెరిసింది. నడువొంపులు చూపిస్తూ హాట్‌ పోజులిస్తూ దిగిన ఫోటో షూట్‌ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నెటిజన్లని కట్టిపడేస్తుంది. ఈ చీరలో అనసూయ యమ సెక్సీగా ఉందని అంటున్నారు కుర్రాళ్లు. 
 

78

అనసూయ కెరీర్‌లో ఇటీవల పెద్ద మార్పు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె `జబర్దస్త్`ని వీడింది. స్టార్‌ మాలో `సూపర్‌ సింగర్‌ జూనియర్స్` కి సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా చేస్తుంది. మరోవైపు శ్రావణ సందడి అనే మరో స్పెషల్‌ షో చేస్తుంది. మరోవైపు ఈశుక్రవారం `వాంటెడ్‌ పండుగాడ్‌` అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో ఆమె గ్లామరస్‌ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. 
 

88

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ సాంగ్‌ కూడా ఉంది. కె. రాఘవేంద్రరావు స్టయిల్‌లో ఉన్న ఈ పాటలో అనసూయ యమ సెక్సీగా కనిపిస్తుంది. అంతేకాదు ఆమెపై రాఘవేంద్రరావు పుచ్చకాయ వేయడం హైలైట్‌గా నిలవబోతుంది. మరి థియేటర్లో ఆ పాటకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు సమర్పకులుగా ఉన్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories