అనారోగ్యంతో బాధపడుతున్న యాంకర్ విష్ణు ప్రియా...? నిజమేనా..? వైరల్ అవుతున్న పోస్ట్

Published : Oct 30, 2023, 03:37 PM IST

నటిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది విష్ణు ప్రియా.  యాంకరింగ్ ను వదిలేసిన యంగ్ బ్యూటీ.. వెండితెరపై మెరుపులు మెరిపించాలని చూస్తోంది. ప్రస్తుతం  విష్ణుప్రియ నటనపై దృష్టి పెట్టింది. నటిగా బిజీ అయ్యే ప్రయత్నాలు కూడా చేస్తుంది.   

PREV
16
అనారోగ్యంతో బాధపడుతున్న యాంకర్ విష్ణు ప్రియా...? నిజమేనా..? వైరల్ అవుతున్న పోస్ట్

ప్రస్తుతం అడపాదడపా ఆఫర్స్ తలుపు తడుతున్నాయి విష్ణు ప్రియకు. అంతే కాదు స్పెషల్ సాంగ్స్ చేస్తూ.. బుల్లితెర హీరో మానస్ తో కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేసింది బ్యూటీ. ఇక రీసెంట్ గా  దయ టైటిల్ తో వెబ్ సిరీస్ చేసింది. జర్నలిస్ట్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో ఆకట్టుకుంది విష్ణుప్రియ. 

26

చక్రవర్తి, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలు చేసిన దయ సిరీస్లో విష్ణుప్రియకు కీలక పాత్రలో నటించి మెప్పించింది. అంతే కాదు దయ సెకండ్ సీజన్ కూడా ఉంది.. అందులో కూడా విష్ణు ప్రియ పాత్ర కొనసాగింపు ఉంటుందనిసమాచారం.  ఇలా నటిగా బిజీ అయిపోయిన మాజీ యాంకర్.. ఆతరువాత సిల్వర్ స్క్రీన్ పై స్టార్ ఇమేజ్ సాధించాలని ఆశపడుతోంది. 
 

36

గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. రష్మీ, అనసూయ స్పూర్తితో కెరీర్లో ముందుకు వెళుతున్నారు. కాగా విష్ణుప్రియ ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్ గా ఆపై నటిగా దూసుకపోతోంది. 

46

ఇక తాజాగా యాంకర్ విష్ణు ప్రియకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. విష్ణు ప్రియ అనారోగ్యంతో బాధపడుతున్నట్ట తెలుస్తోంది. ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆరోగ్యం పాడైంది, కెరీర్ దెబ్బతింది, షెడ్యూల్స్, రిలేషన్స్.. ఇలా అన్నీ ఖరాబ్ అయినా సరే ఇలా చిల్ అవుతున్నా అంటూ వైరల్ అవుతున్న రీల్ ను పోస్ట్ చేస్తూ ప్రస్తుతం తన పరిస్థితి కూడా ఇలాగే ఉందని విష్ణుప్రియ ఆ పోస్ట్ లో వెల్లడించింది. 
 

56

దాంతో ఆమెకు ఏమయ్యిందా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. విష్ణు ప్రియకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె అంటే అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. దాంతో వారు ఈ విషయంలో ఆరాతీయ్యడం మొదలు పెట్టారు. 

66
photo credit instagram

ఇక నటిగా సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఓ మోస్తరు అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. బ్రేక్ ఇచ్చే ఒక సాలిడ్ ప్రాజెక్ట్ కోసం విష్ణుప్రియ ఎదురుచూస్తున్నారు. విష్ణుప్రియ మదర్ స్టార్ హీరోయిన్స్ కి హెయిర్ స్టైలిస్ట్ గా చేశారట. అయినా ఆమె కెరీర్లో ఎదగలేదని విష్ణుప్రియ ఓ సందర్భంలో అన్నారు.

click me!

Recommended Stories